సిద్ధమ్మను చూశారా..?


మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ సైరా నరసింహారెడ్డి ‘ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులకు సంబంధించిన ఫోటోలను వారి పుట్టిన రోజుల సందర్భంగా రిలీజ్ చేస్తున్న యూనిట్.. తాజాగా నయనతార బర్త్‌డేని పురస్కరించుకుని ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మూవీలో నయన..సిద్దమ్మ పాత్రలో నటిస్తోంది. గతంలో చిరు, నయనలతో కూడిన ఫోటోను అమితాబ్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.