home page

లక్షద్వీప్ గొడవేంటీ..? కేంద్రం ఎందుకు నోరు మూసేసుకుంది..?

 | 
lakshadweep
 

లక్షదీవుల్లో 97శాతం ప్రజలు ముస్లిములు. ఇంకేం మన గుజరాతీల కన్ను ఇక్కడ పడింది. రాజకీయనాయకుడిగా మారిన ఒక గుజరాతీ వ్యాపారిని లక్షదీవుల పరిపాలనాధికారిగా పంపించారు. వీడు పరిపాలనాధికారిగా వచ్చిననాటినుండే ప్రశాంతంగా వున్న దీవుల్లో గుజరాత్ అగ్నిని మండించడం ప్రారంబించాడు.

డిసెంబర్ 5, 2020న పరిపాలనాధికారిగా పగ్గాలు చేపట్టిన ఈ గుజరాతీ, ప్రపుల్ల పటేల్ వెంటనే హిందుత్వ అమలుచేయడానికి నడుం కట్టాడు. ముందు జాగ్రత్తగా ఎవరినైనా నిర్బందించడానికి, దేన్నైనా వారంట్ లేకుండా శోధించడానికి వీలయ్యేలా చట్టం రూపొందించాడు. దీన్నే Prevention of Anti-social Activities Regulation (PASA) అంటారు. దీని ప్రకారం ఏ వ్యక్తినైనా నిర్బందించవచ్చు. ఏడు దినాల వరకూ నిర్బందిచిన వ్యక్తి తరపు వ్యక్తులకు సమాచారం ఇవ్వక్కరలేదు. నిర్బందించిన వ్యక్తికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలను అధికారులు బయట పెట్టవలసిన అవసరం లేదు. ఆ నిర్బందించిన వ్యక్తి ముగ్గురు సభ్యుల "సలహా సంఘానికి" పిర్యాదు చేసుకోవచ్చు. ఆ సలహా సంఘం అతని నిర్బందాన్ని ఒకే చేస్తే అతన్ని ఏడాది వరకూ నిర్బందించవచ్చు. ఈ సలహా సంఘాన్ని పరిపాలనాధికారే నియమిస్తాడు. అంటే ఏమిటి అంతా పరిపాలనధికారి కోరుకున్నట్టే జరుగుతుందన్నమాట.


ఇదిలా వుంటే పశు సంవర్ధక శాఖ జారీ చేసిన చట్టం హిందుత్వ అజెండా అమలు చేసే చట్టం. దీని పేరేమో Animal Preservation Regulation. కానీ దీన్ని సింపుల్ గా గోవధ/గోమాంస నిషేధ చట్టం అనవచ్చు. దీని వుద్దేశ్యం అదే. 97శాతం ముస్లిములే వున్న లక్షదీవుల్లో గొడ్డుమాంసాన్ని నిషేధించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని ప్రకారం ఏ పశువునైనా వధించాలంటే ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి. ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలోనే వధ జరగాలి. ప్రభుత్వ అనుమతితోనే పశువును ఒకచోటినుండి మరోచోటుకి తరలించాలి. ఈ పశువుల్లో మళ్ళీ 1.ఆవు 2.ఆవుదూడ 3.ఎద్దు 4.కోడె లు ప్రత్యేక సెక్షన్లో (సెక్షన్ 5(2)) కొలువుదీరాయి. వీటిని చంపినట్టు ఋజువైతే పదేళ్ళకు తక్కువ గాకుండా యావజ్జీవ కారాగారం మరియు కనీసం లక్ష రూపాయలకు తగ్గకుండా అయిదు లక్షల రూపాయల జరిమానా.

అదే రవాణా చేస్తూ పట్టుబడితే ఏడేళ్లకు తక్కువ గాకుండా పదేళ్ల వరకూ జైలు శిక్ష మరియు కనీసం లక్ష రూపాయలకు తగ్గకుండా అయిదు లక్షల రూపాయల జరిమానా. సెక్షన్ 8 ప్రకారం ఏ వ్యక్తీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ గొడ్డు మాంసాన్ని గానీ, గొడ్డు మాంస ఉత్పత్తులు గానీ అమ్మడం, కొనడం, రవాణా చెయ్యడం, నిల్వ చెయ్యడం నిషిద్దం. గొడ్డు మాంసం వుందనే అనుమానంతో ఏ వాహనాన్నైనా, ఏ స్థలాన్నైనా, భవనాన్నైనా అధికారులు తనిఖీ చేయవచ్చు, ఎవర్నైనా నిర్బందించి ప్రశ్నించవచ్చు. ఇందులో మరో ఆణిముత్యం..సెక్షన్ 11 ప్రకారం ఈ నేరాలు నాన్-బెయిలబుల్!

మరో వజ్రపు తునక, సెక్షన్ 14 ప్రకారం ఏ అధికారినీ కోర్టుకు ఈడ్వడానికి లేదు. అంటే ఏ గొట్టంగాడైనా నా యింట్లో పడి తనిఖీ చేసి నన్ను అరెస్టు చేసి నా బొక్కలు ఇరగ్గొట్టవచ్చు. ఒకవేళ అనుమానించినట్టు నా దగ్గర ఏమీ దొరక్కపోయినా నన్ను అనవసరంగా తనిఖీ చేసినందుకు, అరెస్టు చేసి హింసించినందుకూ ఆ సదరు అధికారి మీద నేను కోర్టుకు పోవడానికి లేదు.

కశ్మీరులు వూరికే పుట్టవు. ఇలాంటి లండీ కొడుకులు దాపురించి ఇలంటి చట్టాలు చేస్తేనే పుడతాయి. 97 శాతం ముస్లిములు మరియు తమకు ఇష్టమైన గొడ్డుమాంసం తినకుండా ఇంత కఠిన చట్టాలు తెస్తే ఒక్క తెలుగోడు తప్ప ఏ సామాన్యుడైనా ఈ చట్టాన్ని అమలుపరచజూసినవాడి మీద రాయి విసురుతాడు. ఇక నిర్బందం మొదలవుతుంది. ఆ తర్వాత మిలటరీ దిగుతుంది. పెల్లెట్ గన్స్ వస్తాయి. మనమంతా రాయి విసిరినవాన్ని టెర్రరిస్టుగా జమగట్టి తుపాకీతో కాల్చి చంపినవాన్ని దేశభక్తుడుగా కీర్తిస్తాం.

Prasad Charasala