home page

మోడీ బండారం బయటపెట్టిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..!

 | 
మోడీ బండారం బయటపెట్టిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి..!

Kailash Vijayvargiya : దేశంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వాల్ని కూల్చేందుకు ప్రయత్నాలు, కూలదోయటాలు, జరుగుతూనే ఉన్నాయి. బీజేపీయేత పార్టీల ప్రభుత్వాలున్న చోట.. నయానో.. బయానో.. ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు.

ఇటీవల మద్యప్రదేశ్(madhyapradesh) లోనూ ప్రభుత్వం కూలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్(congress) పార్టీ విజయం సాధించింది. అయితే సీఎం పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్న జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీ(bjp)లో చేరారు.

ఇంకేముంది కమల్ నాథ్ సర్కారు కూలిపోయి.. తిరిగి శివరాజ్ సింగ్ చౌహన్(shivraj singh chouhan) సర్కారు వచ్చింది. అయితే.. ఇదంతా అక్కడి నేతలు, బీజేపీ నేషనల్ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah), కేంద్రమంత్రులు నడిపించిన వ్యవహారం అని అంతా అనుకున్నారు.

కానీ.. ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya). మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారు కూలిపోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీదే(narednra modi) ప్రధాన పాత్ర అని బయటపెట్టేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయం చెప్పారు.

"మీరు ఎవరికి చెప్పకండి. నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. మొదటిసారి ఈ వేధికపై చెబుతున్నను. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో గొప్ప పాత్ర ఎవరిదైనా ఉందంటే.. అది మోడీ గారిదే... ధర్మేంద్ర ప్రధాన్ ది కాదు.," అంటూ అసలు విషయం చెప్పేశారు.

మరోవైపు.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వమే ప్లాన్ చేసిందని గతంలోనే బయటపెట్టేశారు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.

ఇంకేముంది.. దేశ ప్రధాని పదవిలో ఉండి ప్రభుత్వాలను కూలదోయడమే పనిగా పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎదురుదాడి మొదలుపెట్టారు.

- Horoscope today telugu : 17-12-2020 గురువారం నేటి రాశిఫలాలు

- ఫొటో పెట్టి మరీ తిట్టించుకుంటున్న తెలుగు టాప్ యాంకర్..!