home page

మనిషి కంటే కుక్కే నయ్యం... ఇగో ఇందుకే.. !

 | 
మనిషి కంటే కుక్కే నయ్యం... ఇగో ఇందుకే.. !

కుక్కకున్న విశ్వాసం మనుషుల దగ్గర ఉండదని మన పెద్దవాళ్ళు ఊరికే అనరు.. అందుకు బెస్ట్ ఉదాహరణే ఈ వార్త... మానసిక వికలాంగురాలైన ఓ అమ్మాయి ఆలనా పాలనా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు ఆమెను ఇంటి పక్కన ఓ షెడ్డు నిర్మించి, కాపలాగా ఓ కుక్కను పెట్టారు. అయితే ఆ మానసిక వికలాంగురాలైన అమ్మాయిపైన ఓ ప్రభుద్దుడు కన్నేశాడు.. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు.

ఇది గమనించిన ఆ కుక్క అతడి అంతుచూసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు సెల్వపురం ప్రాంతానికి చెందిన బాధితురాలు మానసిక వికాలాంగురాలు దీనితో ఆమెను ఆమె తల్లిదండ్రులు ఇంటి పక్కన ప్రత్యేకంగా షెడ్డు నిర్మించి అందులో ఉంచారు. కాపలాగా ఓ కుక్కను కూడా పెట్టారు.

ఈ క్రమంలో దిలీప్‌ కుమార్‌ అనే వ్యక్తి గత నెల 29న బాధితురాలి ఇంటికి వచ్చి ఆ మానసిక వికలాంగురాలైన అమ్మాయిపైన కన్నేశాడు. ప్లానింగ్ లో భాగంగా షెడ్డులో పవర్‌ కట్‌ చేసి ఆ షెడ్డులోకి దూరాడు. ఇదంతా గమనిస్తున్న ఆ కుక్క.. దిలీప్ కుమార్ వెంట వెళ్లి అతని ప్యాంట్‌ పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అనుకోని సంఘటన ఎదురుకావడంతో.. దిలీప్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

కానీ కుక్క మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో బయట శబ్దం రావడంతో భాదితురాలి తల్లిదండ్రులు బయటకు వచ్చి చూస్తే.. అక్కడ కుక్కతో పెనుగులాడుతున్న దిలీప్‌ కుమార్‌ను గమనించారు. ఇరుగుపొరుగు వారిని పిలిచి దిలీప్ కుమార్ ని పోలీసులుకి అప్పగించారు. పొలీస్ స్టేషన్ కి వెళ్ళాక దిలీప్ కుమార్ గురించి పోలీసులకి సంచలన విషయాలు తెలిశాయి.

దిలీప్ కుమార్ గతంలో మహిళలను వేధించేవాడని, అతగాడి ఫోన్‌లో పలువురు మహిళల అసభ్యకర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా సదరు భాదితురాలు పైన రెండుసార్లు అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడని ప్రాధమిక విచారణలో తేలింది. ఇక కనీసం కుక్కుకున్న దయ.. ఆమె తల్లిదండ్రులకి లేకపోవడం ఇక్కడ దారుణం..

ఒకవేళ అక్కడ ఆ కుక్క గానీ లేకుంటే ఆ అభాగ్యురాలి పరిస్థితి ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇందుకే కుక్కకున్న విశ్వాసం మనుషుల దగ్గర ఉండదనేది.