home page

 ఒక్కో మామిడి పండును 10వేలు పెట్టి కొన్నాడు.. ఎందుకో తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..! 

 | 
Dozen Mangoes
 

ఓ బాలిక రోడ్డుపక్కనే మామిడి పండ్లు విక్రయిస్తోంది.  ఓ వ్యక్తి వచ్చి.. మామిడి పళ్ల ధర అడకుండా... ఒక్కో మామిడి పండును 10  వేలకు కొంటున్నట్లు బాలికకుచెప్పాడు. అన్నట్లుగానే 12 మామిడి పండ్లను తీసుకొని...  ఒక లక్షా 20వేలు నగదును బాలిక తండ్రి బ్యాంక్ అకౌంట్లో వేశాడు. ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఝార్ఖండ్​ జంషెద్​పుర్​కు చెందిన ఈ బాలిక పేరు తులసి కుమారి.  సాయం చేసిన వ్యాపార వేత్త పేరు హమేయా హెటె - వాల్యుబుల్ ఎడ్యుటైన్​మెంట్ ప్రైవేట్​ లిమిటెడ్ మేనేజింగ్​​ డైరెక్టర్​గా ఆయన పని చేస్తున్నారు.  పేద కుటుంబానికి చెందిన తులసి కుమారి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో పాఠశాలలు మూతపడి ఆన్​లైన్​లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కొనే ఆర్థిక స్తోమత లేక.. రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్మి డబ్బు పోగు చేయాలని తులసి భావించింది.  

అయితే  తులసి తన ఆర్థిక కష్టాల గురించి స్థానిక మీడియాకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న హమేయా హెటె.. బాలికకు సాయం చేయాలనుకున్నారు. ఒక్కో మామిడి పండును రూ.10వేలకు కొంటున్నట్లు ఆయన చెప్పగానే తులసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.  డబ్బులు తులసి తండ్రి శ్రీమర్ కుమార్​ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు హెటె. దీంతో తులసి స్మార్ట్ ఫోన్​ కొనుగోలు చేసి ఆన్​లైన్​ తరగతులకు హాజరవుతోంది.