home page

 రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు..! పెద్ద షాకిచ్చిన IMA..!

 | 
Ram dev baba

 పతంజలి సంస్థ ఓనర్, యోగా గురువు రాందేవ్ బాబాకు సెగ తగులుతూనే ఉంది. ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు.. రాందేవ్ బాబాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రెండు మూడు రోజులుగా ఈ ఇష్యూ నడుస్తున్నా.. ఇప్పుడది మరింత తీవ్రరూపం దాల్చింది. రాందేవ్ బాబాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓ లేఖ రాశారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు. 


కరోనా వ్యాక్సిన్ పై, అల్లోపతి మెడిసిన్ పై రాందేవ్ బాబా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా పది వేల మంది డాక్టర్లు చనిపోయారని రాందేవ్ బాబా కామెంట్ చేశారు. అలాగే.. అల్లోపతి మెడిసిన్ వాడుతున్నా లక్షలాది మంది చనిపోయారని రాందేవ్ బాబా అన్నారు. 


రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని నీరుగార్చేలా రాందేవ్ బాబా మాట్లాడారన్నారు ఐఎంఏ ప్రతినిధులు. ఆయనపై వెంటనే దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రధానిని కోరారు.


మరోవైపు.. రాందేవ్ బాబాపై వెయ్యికోట్ల రూపాయల పరువునష్టం దావా వేసింది ఉత్తరాఖండ్ మెడికల్ అసోసియేషన్. అల్లోపతి మెడిసిన్ పై ఆయన చేసిన కామెంట్ల నేపథ్యంలో ఈ నోటీసులిచ్చింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.