home page

తుంపర్లే కదా అని లైట్ తీసుకుంటే... కొంప కొల్లేరే..!

కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

 | 
covid-19-aerosols-can-travel-10-metres

- కొంప ముంచుతున్న తుంపర్లు

- గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణం

-  డబుల్ మాస్క్ కంపల్సరీ అంటున్న కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించింది.

ఫిజికల్ డిస్టెన్స్, ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, తరుచుగా శానిటైజ్ చేసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ రాఘవన్ కార్యాలయం తెలిపింది.

కరోనా విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతకమని హెచ్చరించింది ప్రభుత్వం. గాలిద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది.

కరోనా సోకిన వారి నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే డ్రాప్లెట్స్ చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. కరోనా సోకిన వారి నుంచి గాలిలోకి వచ్చిన డ్రాప్లెట్స్ 10 మీటర్ల వరకు వ్యాపించే అవకాశముందని చెప్పింది. ఎలాంటి లక్షణాలు లేని పేషెంట్ల నుంచి వచ్చే డ్రాప్లెట్స్(తుంపర్లు) కూడా ప్రమాదకరమని చెప్పింది.

పెద్ద సైజులో ఉన్న డ్రాప్లెట్స్(తుంపర్లు) 2 మీటర్ల లోపలే కింద పడిపోతాయని.. చిన్నసైజులో ఉన్న తుంపర్లు మాత్రం పది మీటర్ల వరకు వెళ్తాయని.. ఆ పరిధిలో మాస్క్ లేకుండా ఉన్న వారికి వైరస్ సోకే ప్రమాదముందని రాఘవన్ కార్యాలయం తెలిపింది.

వైరస్ సోకిన వారి నుంచి వస్తువుల ఉపరితలంపై పడిన తుంపర్లలోని వైరస్ చాలాకాలం వరకు జీవించి ఉంటుందన్నారు. అందుకే తరుచుగా చేతులను, ఉపరితలాలను శానిటైజ్ చేయాలని సూచించారు.

మాస్కుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ 95 మాస్క్ అయితేనే పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుందన్నారు. అవి అందుబాటులో లేని వారు రెండు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని చెబుతున్నారు. కాటన్ మాస్కుల కంటే సర్జికల్ మాస్క్ అయితే ఇంకా బెటర్ అంటున్నారు.

ఇళ్లు, పని ప్రదేశాల్లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. పని ప్రదేశాల్లో ఖచ్చితంగా వెంటిలేషన్ ఎక్కువ ఉండాలని.. లేకపోతే ఎక్కువమందికి వైరస్ వ్యాపించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.