home page

ఈ అత్యాచార కేసు విన్నాక, రక్తం మరగకపోతే వాడు మనిషే కాదు!

 | 
ఈ అత్యాచార కేసు విన్నాక, రక్తం మరగకపోతే వాడు మనిషే కాదు!

1992 లో రాజస్థాన్ జైపూర్ కి దగ్గర్లోని భాటేరి గ్రామంలో భన్వరీ దేవి అనే మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. కుండలు తయారు చేసే కులానికి చెందిన ఆమెని, అదే గ్రామానికి చెందిన సో కాల్డ్ అగ్రవర్ణాల వాళ్ళు ఐదుగురు, ఆమె భర్త ఎదుటే అత్యాచారం చేశారు.

ఆమె స్త్రీ ,శిశు సంక్షేమ శాఖలో గ్రామస్థాయిలో వలంటీర్ లాగా పనిచేసేది. ఆ గ్రామంలో జరుగుతున్న ఒక బాల్య వివాహాన్ని ఆపినందుకు ఆమెపై గ్రామపెద్దలు ఈ దురాగతానికి ఒడిగట్టారు. అయితే, పోలీసులు కేసు బుక్ చేయడానికి ఇష్టపడలేదు. ఎంతో వత్తిడి మీద కేసు బుక్ చేశారు. మెడికల్ ఎగ్జామినేషన్ చేయడానికి 48 గంటల సమయం తీసుకున్నారు. చివరికి కేసు జిల్లా కోర్టుకి చేరింది.

1995 లో ఆ జిల్లా జడ్జి, మొత్తం భారత న్యాయ వ్యవస్థ సిగ్గుతో, తలల్ని మొలల్లో పెట్టుకోవాల్సిన తీర్పు ఇచ్చారు. ఆ ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ, ఆ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా...

1. నిందితులు అగ్రవర్ణాల వాళ్ళు కాబట్టి వారు ఈ కులస్తులని ముట్టుకొనే ముట్టుకోరు కాబట్టి అత్యాచారం అనే సమస్యే లేదు.

2. తన భార్యపై అత్యాచారం చేస్తుంటే ఏ భర్తా చూస్తూ ఊరుకోడు కాబట్టి అత్యాచారం జరిగి ఉండదు. ( వాళ్ళు భర్తని చితక్కొట్టారు)

3. నిందితుల్లో మేనమామ , మేనల్లుడు ఉన్నారు కాబట్టి, ఇద్దరూ ఒకే స్త్రీపై అత్యాచారం చేయరు.

4. నిందితుల్లో గ్రామ పెద్ద కూడా ఉన్నారు కాబట్టి గ్రామపెద్ద ఇలాంటి తప్పు చేయరు కాబట్టి అత్యాచారం జరిగి ఉండదు.

ఇవీ ఆ జడ్జి వ్యాఖ్యలు, ఫోరెన్సిక్ నివేదికలో ఆమె లోదుస్తులపై 5 గురి వీర్యపు మరకలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ( అవి వీళ్ళవి కాదు) , అత్యాచారం జరగలేదు అని ఐదుగురు నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేశారు.

ఈ జడ్జిమెంట్ వచ్చిన రోజు , స్థానిక ఎమ్మెల్యే పెద్ద ఊరేగింపు కూడా నిర్వహించాడు. ఈ తీర్పుని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. 25 ఏళ్లుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇదీ స్వతంత్ర భారతంలో ఒక బహుజన స్త్రీకి జరిగిన న్యాయం.

ఇంత దారుణమైన ఘటనలు ఉత్తర భారతంలో కోకొల్లలు. అగ్రవర్ణాల ఓట్లపై ఆధారపడిన రాజకీయ పార్టీలు, ఈ పరిస్థితులు మార్చాలి అంటే భయపడతాయి.

Naresh Siramani