బిజీ బిజీగా బిగ్ బాస్ నందిని రాయ్ !!!

ఇప్పుడు బాలీవుడ్ లోకి తిరిగి అడుగుపెట్టబోతున్న నందిని రాయ్ అక్కడి ప్రేక్షకులను ఏమేరకు అలరించబోతుందో చూడాలి.తాను ఇప్పుడు చేస్తున్న సినిమాలు తనకి మంచి పేరు తీసుకొస్తాయని గట్టిగా చెప్తోంది నందిని రాయ్.

మలయాళం లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం లాల్ బాగ్. ఈ చిత్రంలో తెలుగు సహజ నటి అయిన నందినీ రాయ్ హీరోయిన్ గా నటిస్తోంది . మరియు హిందీలో నందీ అనే సినిమాలో కూడా నటిస్తోంది .

ఇప్పటికే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో అనేక తెలుగు సినిమా ఆఫర్సతో పాటు తమిళం,మళయాలంలో కూడా మంచి ఆఫర్లను అందుకుంది నందిని రాయ్ . బాలీవుడ్ లో ఫ్యామిలీ ప్యాక్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఈ సుందరి అనతికాలంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది.

ఇక ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం 040. ఇక ఆ తర్వాత వచ్చిన మాయ,మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీఫెలోస్ సినిమాలతో తక్కువ కాలంలోనే తన మార్క్ ని చూపించింది. ఇక మళయాలం, కన్నడ లో నటించిన గుడ్ బాయ్ డిసెంబర్,ఖుషి ఖుషి యాగీ సినిమాలతో పాటు మరికొన్ని ఆఫర్స్ లను అందుకుంది.

ఇప్పుడు బాలీవుడ్ లోకి తిరిగి అడుగుపెట్టబోతున్న నందిని రాయ్ అక్కడి ప్రేక్షకులను ఏమేరకు అలరించబోతుందో చూడాలి.తాను ఇప్పుడు చేస్తున్న సినిమాలు తనకి మంచి పేరు తీసుకొస్తాయని గట్టిగా చెప్తోంది నందిని రాయ్.