మోజో టీవీ మాజీ CEO అరెస్ట్

mojo tv revathi arrest

మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. రేవతిని కొద్దిసేపు ఇంటిలోనే నిర్భంధించిన పోలీసులు.. తర్వాత స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది.

Read Also : మేం స్నేహాన్ని కోరుకుంటున్నాం

పాత కేసులో కావాలనే తనను అరెస్ట్ చేస్తున్నారని ట్విట్టర్ లో ఆరోపించారు రేవతి. దీని వెనుక మైంహోం రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి ఉన్నారని ఆరోపించారు.

Read Also : గుండెల్లో కన్నీటి వరద

Also Read : వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా ఆమె తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తనకు ఏదైనా జరిగితే కేటీఆర్ ఫ్యామిలీదే బాధ్యతన్నారు. తమ ముందు తలొంచలేదని.. ఓ మహిళా జర్నలిస్టును ఈ స్థాయిలో టార్చర్ పెడతారా..? అని ప్రశ్నించారు.

Read Also : సర్టిఫికేట్ చూపిస్తానంటున్న రకుల్ ప్రీత్ సింగ్

కొద్ది రోజుల క్రితమే మోజో టీవీ నుంచి సీఈవోను బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై అప్పట్లో మోజో టీవీలో ఓ రోజంగా చర్చ నడిచింది.