మానవత్వం చాటుకున్న మంత్రి ఈటల

మంత్రి ఈటల రాజేందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లాలోని కొడిమ్యాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆ సమయానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ప్రమాదానికి గురైనవారిని గుర్తించి బాధితులను దగ్గరుండి తమ కాన్వాయ్‌ వాహనంలో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

శుక్రవారం కూడా రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ వెళ్తుండగా.. కొత్తగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి అక్కడ ఆగారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఆదుకుంటామని చెప్పారు.

వరుసగా రెండు రోజులు బాధితులను పరామర్శించిన మంత్రిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.