మంగ్లీ గ్లామర్.. దామోదర్ రెడ్డి డైరెక్షన్.. బతుకమ్మ సాంగ్ అదిరింది

దామోదర్ రెడ్డి అద్బుతమైన డైరెక్షన్.. మంగ్లీ వాయిస్, గ్లామర్.. అన్నీ కలిసి.. ఈ సారి సాంగ్ ను మరింత అందంతా తీర్చిదిద్దాయి.

బతుకమ్మ పాటల్లో మంగ్లీ స్టైలే వేరు. ఎన్ని పాటలొచ్చినా మంగ్లీ బతుకమ్మ పాట కోసం యూట్యూబ్ లో వ్యూయర్స్ వేచి చూసేలా ఎట్రాక్ట్ చేసింది. స్వయంగా సింగర్ కావడం.. హవభావాలు పలికించడంలో మంగ్లీ పర్ ఫెక్ట్. కాబట్టి మంగ్లీ అలియాస్ సత్యవతి బతుకమ్మ పాటలకు పబ్లిక్ ఫిదా అవుతున్నారు

మంగ్లీ పాటల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ దామోదర్ రెడ్డి గురించి. ఎందుకంటే ప్రతీ ఫ్రేమ్ ను కుంచెతో వేసినట్టుగా తీర్చిదిద్దుతారు దామోదర్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన డైరెక్షన్ లో వచ్చిన సాంగ్స్ అన్నీ ఓ సారి పరిశీలిస్తే.. ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లైటింగ్ ఎఫెక్ట్ కానీ.. కెమెరా యాంగిల్ కానీ.. దామోదర్ టేకింగ్ అద్భుతమనే చెప్పాలి.

దామోదర్ రెడ్డి అద్బుతమైన డైరెక్షన్.. మంగ్లీ వాయిస్, గ్లామర్.. అన్నీ కలిసి.. ఈ సారి సాంగ్ ను మరింత అందంతా తీర్చిదిద్దాయి.