మహర్షి టీజర్ : ఏం చెప్పావ్ మహేశ్..!!

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన క్రేజీ సినిమా మహర్షి టీజర్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ , సాంగ్ టీజర్లతో అలరించిన మూవీ మేకర్స్… టీజర్ తోనూ బాగానే ఆకట్టుకున్నారు. మహేశ్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ వండర్ ఫుల్ గా ఉంది. హెలికాప్టర్ నుంచి దిగడం… సక్సెస్ గురించి ఆయన చెప్పే మాటలు.. రెండు ఫైట్లు… కేక పెట్టించేలా ఉన్నాయి.

సక్సెస్ అనేది ఓ డెస్టినేషన్ కాదు… సక్సెస్ అనేది ఓ జర్నీ,… ఎవరైనా నువ్వు ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు …. లాంటి డైలాగులు బాగా కనెక్టవుతాయి. అంతెత్తున్న మహేశ్ బాబు.. గూండాలను మడతపెట్టి ఉతికేస్తుంటం చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు.

మూవీ మే 9న విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇది మహేశ్ కెరీర్ లో 25వ సినిమా.