మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల

మహారాష్ట్రహర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 4. అక్టోబర్ 5న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ అక్టోబర్ 7.

మహారాష్ట్రహర్యానా రాష్ట్రాల్లో అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే ఫేజ్ లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 24న ఫలితాలు ప్రకటించనున్నారు. మహారాష్ట్రలో 288 సీట్లుహర్యానాలో 90 సీట్లకు పోలింగ్ జరగనుంది.

ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. మహారాష్ట్రలో 8.94 కోట్ల ఓటర్లు ఉండగాహర్యానాలో 1.82 కోట్ల ఓటర్లు ఉన్నట్లు అరోరా చెప్పారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 17 రాష్ట్రాల్లో 63 అసెంబ్లీ స్థనాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో అక్టోబర్  21న  పోలింగ్, అక్టోబర్ 24న  ఫలితాలు  వెల్లడికానున్నాయి.

అరుణాచల్ లో  ఒకటిఅసోంలో  4బిహార్ లో  5,  చత్తీస్ గఢ్ లో  ఒకటిగుజరాత్ లో  4హిమాచల్ లో  2కర్ణాటకలో 15,  కేరళలో 5,  మధ్యప్రదేశ్,  మేఘాలయ  ఒడిశా,  పుదుచ్చేరి లో ….ఒక్కో నియోజకవర్గంలో  ఉప ఎన్నికలు  నిర్వహించనున్నారు. పంజాబ్ 4,  రాజస్థాన్ 2 సిక్కింలో  3తమిళనాడులో  2యూపీలో  11 సీట్లకు  బైపోల్స్  జరగనున్నాయి. తెలంగాణలోని నల్గొండ జిల్లా హుజూర్ నగర్ బైపోల్ కూడా ఇదే షెడ్యూల్ లో జరగనుంది.