ఒక్కటే పీస్.. ఊరమాస్ పిల్ల (‘మారి 2’ ట్రైలర్‌)

రజినీకాంత్ అల్లుడు హీరో ధరుష్ నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్‌టైనర్ మూవీ ‘మారి 2’ ట్రైలర్‌ విడుదల అయ్యింది. ‘మారి’ చిత్రానికి సీక్వెల్‌గా తమిళంలో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఫిదా పిల్ల సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటిస్తోంది. వ‌ర‌ల‌క్ష్మీ శరత్ కుమార్ ప్రతి నాయిక పాత్రలో కనిపిస్తున్నారు. బాలాజీ మోహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. చావంటే భయమే లేని డాన్ పాత్రలో కామెడీ పండిస్తున్నాడు ధనుష్. పక్కా మాస్ అవతారంలో అదరగొడుతున్నాడు. ధనుష్‌‌కి జోడీగా నటించిన సాయి పల్లవి.. ఆటో డ్రైవర్‌ గెటప్‌లో రౌడీ బేబీగా ఒక్కటే పీస్ ఊర మాస్ అనేలా ఉంది. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు.