CM Kcr : ముందస్తు రాష్ట్రంలోనా..? కేంద్రంలోనా..?
Latest Telangana

CM Kcr : ముందస్తు రాష్ట్రంలోనా..? కేంద్రంలోనా..?

What is the plan of cm kcr : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలురాబోతున్నాయనే వార్త చాలాకాలంగాచక్కర్లు కొడుతోంది. ఏ క్షణంలోనైనా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే అవకాశాలున్నాయని అపోజిషన్ పార్టీలు అంటున్నాయి. అందుకే అపోజిషన్ పార్టీలన్నీ హడావుడి చేస్తున్నాయి. ఏదో ఓ పేరు చెప్పి జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కేసీఆర్(cm kcr) చేస్తున్న హడావుడి కూడా అలాగే ఉంది. సడెన్ గా జిల్లాల పర్యటనలు పెంచారు. వరుసపెట్టి జిల్లాలు చుట్టేస్తున్నారు. కలెక్టరేట్లు ఓపెనింగ్ చేస్తున్నారు. వెళ్లిన ప్రతీ చోటా మోడీ సర్కారు టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. స్టేట్ బీజేపీ లీడర్లపైనా విరుచుకుపడుతున్నారు.

అటు బీజేపీ, కాంగ్రెస్ కూడా జోరు పెంచాయి. ప్రజాసంగ్రామయాత్ర పేరుతో ఇప్పటికే మూడు విడతలుగా రాష్ట్రాన్ని చుట్టేశారు. నాలుగో విడతతో హైదరాబాద్ తో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసేందుకు రెడీ అయ్యారు. ప్రతీ ఇష్యూలో ధర్నాలు, రాస్తారోకోలతో హడావుడి చేస్తున్నారు.

అటు కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. పార్టీలో ఎన్ని కొట్లాటలున్నా.. అధికారపక్షంతో కొట్లాట ఆపేది లేదంటున్నారు నేతలు. ఢిల్లీ డైరెక్షన్ లో ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. మునుగోడు బైపోల్ తో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పుకుంటున్నారు.

Read Also :

అయితే.. రాష్ట్రంలో పొలిటికల్ హడావుడి ఈ స్థాయిలో ఉన్నా.. కేసీఆర్ మాత్రం వీటి గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఎక్కడికెళ్లినా జాతీయ రాజకీయాలపైనే మాట్లాడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా అంటూ ప్రజలను అడుగుతున్నారు.

మోడీ సర్కారు గత ఎనిమిదేళ్లలో చేసిన తప్పులను, రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తున్నారు. మతం పేరుచెప్పి బీజేపీచేస్తున్న మోసాలను వివరిస్తున్నారు. జనం మధ్య చిచ్చుపెట్టి ఓట్ల కోసంచేస్తున్న ప్రయత్నాలపైనా ప్రజలను జాగరూకులను చేస్తున్నారు.

అయితే.. ఇదంతా చూస్తోంటే ముందస్తు ఎన్నికలు రాష్ట్రంలో రాబోతున్నాయా..? దేశంలో రాబోతున్నాయా.? అనే రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. కేసీఆర్ పదే పదేకేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబు ఉందనే చర్చ అయితే జరుగుతోంది.

ఇటీవలే పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలను కేసీఆర్ కలిశారు. రెండు మూడురోజుల పాటువారితో మాట్లాడారు. గతంలోనే రిటైర్డ్ పబ్లిక్ సర్వెంట్లతోనూ భేటీకి ప్లాన్ చేశారు. ఇలా సమాజంలో కీలక పాత్ర పోషించే వారందరితో కేసీఆర్ భేటీ వెనక ఖచ్చితంగా ఏదో మతలబు ఉందనే మాట వినిపిస్తోంది.

అయితే.. కేసీఆర్(cm kcr) నిజంగానే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారో.? లేకపోతే రాష్ట్రంలో ముందస్తుఎన్నికల కోసమే ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.