Akkineni Nagarjuna: .. అసలు నువ్వు సూపర్… నీ కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్..!
Bigg Boss 5 Telugu Latest

Akkineni Nagarjuna: .. అసలు నువ్వు సూపర్… నీ కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్..!

Akkineni Nagarjuna: పుకార్లను నిజం చేస్తూ.. తామిద్దరం విడిపోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అక్కినేని నాగచైతన్య, సమంత(Akkineni Nagarjuna).. భార్యభర్తల విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటామని తమ పోస్టులలో రాసుకొచ్చారు.

గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు వీరిద్దరూ విడిపోకూడదని కోరుకుంటూ వచ్చారు.. ఆ వార్తలు కూడా కేవలం గాలి వార్తలు లాగానే మిగిలిపోవాలని ఆశించారు. కానీ అభిమానుల ఆశలను ముక్కలు చేస్తూ చైసామ్ విడిపోయారు.

వీరిద్దరూ విడిపోవడం అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరొకసారి ఆలోచించుకోవాలని పోస్టులు పెడుతున్నారు. అభిమానులకే ఇలా ఉంటే కన్న తండ్రి అయిన అక్కినేని నాగార్జునకి ఇంకెలా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.

ఈ వార్త తెలిసినప్పటికీ బాధను మనసులోనే ఉంచుకొని.. ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్ పై నవ్వుతూ కనిపించారు నాగార్జున… కోడలు కొడుకు విడిపోతున్నారని తెలిసిన… బాధను గుండెలోనే ఉంచుకొని.. హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు నాగ్. ఇంతటి బాధలో కూడా ఈ వీకెండ్ లో నాగార్జున హోస్టింగ్ చేసిన విధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

నాగ్ .. అసలు నువ్వు సూపర్… నీ కమిట్మెంట్, డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read :