Konda Vishweshwar reddy :బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Latest Telangana

Konda Vishweshwar reddy :బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ మాజీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా సమక్షంలో ఆయన కండువా కప్పుకోనున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీజేపీ స్టేట్ ఇంచార్జ్ తరుణ్ చుగ్, స్టేట్ చీఫ్ బండి సంజయ్.. ఆయనతో మాట్లాడి పార్టీలోకి వచ్చేందుకు ఒప్పించారు. ఈ విషయాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా చెప్పారు.
గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్ లో ఎంపీగా కూడా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆయన.. కొద్ది రోజులకే బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ భవితవ్యంపై ఊహాగానాలు నడుస్తున్నాయి.
మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్తారని, బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. గతంలో అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడే విశ్వేశ్వర్ రెడ్డి చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని అప్పుడు చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్టు ప్రకటించారు.