Kerala actress shahana : పుట్టినరోజు నాడే చనిపోయిన ప్రముఖ నటి
Cinema Latest

Kerala actress shahana : పుట్టినరోజు నాడే చనిపోయిన ప్రముఖ నటి

kerala actress shahana died : పాపం పుట్టినరోజే ఆమె జీవితానికి చివరి రోజు అయింది.. కేరళ మోడల్‌ షహానా బర్త్‌డే నాడే మరణించింది.. అయితే అమెది హత్యానా ఆత్మహత్యనా అన్నది తెలియాల్సి ఉంది. కానీ షహానా కుటుంబీకులు మాత్రం షహానాని ఆమె భర్తనే చంపేశాడని ఆరోపిస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మోడల్ ఈ షహానా.. మే12న ఆమె పుట్టినరోజు.. నిన్న ఆమె  21వ పుట్టినరోజు జరుపుకుంది.. కానీ ఆ రోజే ఆమెకి ఆఖరి రోజు అయింది.

అదే రోజు అర్ధరాత్రి 1 గంటల సమయంలో షహానా చనిపోయిందని ఆమె కుటుంబానికి  ఫోన్ వచ్చింది. అయితే షహానా మరణానికి ఆమె భర్తే కారణమని ఆమె కుటుంబీకులు ఆరోపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

actress shahana

దీనిపైన షహానా తల్లి మాట్లాడుతూ..  తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, ఇది హత్యేనని, ఆమె భర్తే చంపేశాడని ఆరోపించింది. షహానా భర్త సజ్జద్‌ తాగొచ్చి నానా గొడవ చేసేవాడని, అతనితో పాటుగా అతని తల్లిదండ్రులు, సోదరి కూడా తన కూతురికి నరకం చూపించేవారని తెలిపింది.

actress shahana died

ఈ బాధ చూసి తట్టుకోలేక తన కూతుర్ని వేరే కాపురం పెట్టమని సూచించానని పేర్కొంది. షహానా భర్త సజ్జద్‌ కూడా డబ్బు కోసం దారుణంగా ప్రవర్తిస్తున్నాడని, ఆమె దగ్గరున్న 25 సవర్ల బంగారాన్ని కూడా వాడుకున్నాడని తెలిపింది. షహానా తన పుట్టినరోజున మమ్మల్ని కలవాలనుకున్నా అందుకు వాళ్లు ఒప్పుకోలేదని తెలిపింది.

actress shahana died 1

అయితే ఇంతటి ఘోరం జరుగుతుందని అనుకోలేదని తెలిపింది. కాగా షహానా పలు జ్యువెలరీ యాడ్స్‌లో నటించి ఏడాదిన్నర క్రితం సజ్జాద్‌ను పెళ్లాడింది.  అత్తమామలు, భర్త సోదరి చిత్రహింసలు భరించలేక గతవారం బయటకు వచ్చేసి భర్త సజ్జద్‌ తో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది.

Read Also :