Cm kcr challenge to modi:పడగొట్టి చూడు.. మోడీకి  కేసీఆర్ సవాల్
Latest Telangana

Cm kcr challenge to modi:పడగొట్టి చూడు.. మోడీకి కేసీఆర్ సవాల్

బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ విసిరారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పారు. తమకు 103 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. మిత్రపక్షం సపోర్ట్ కూడా ఉందన్నారు.
“బీజేపీ కేంద్రమంత్రులు ప్రతి రోజు.. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. దమ్ముంటే పడగొట్టండి. మేం కూడా కాస్త ఫ్రీ అవుతాం. ఢిల్లీ వచ్చి మీ ప్రభుత్వాన్ని పడగొడతాం. తెలంగాణ ఏనాడూ వెనకడుగు వేయదు… “ అని చెప్పారు కేసీఆర్.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా జలవిహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.