Kcr gift for Students: స్టూడెంట్స్ కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్
Latest Telangana

Kcr gift for Students: స్టూడెంట్స్ కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సారి కూడా స్టూడెంట్స్ కు గిఫ్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాస్ పర్సంటేజీ ఫుల్లుగా పెరిగిపోయింది. కరోనా టైంలో విద్యార్థులను పరీక్ష రాయకుండానే పాస్ చేసింది సర్కారు. ఇప్పుడు పాస్ పర్సంటేజీతో మరో గిఫ్ట్ ఇచ్చినట్టైంది.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది పాసయ్యారు. ఎప్పటిలాగే అమ్మాయిలు ముందున్నారు. 92.45 శాతంతో అమ్మాయిలు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 87.61 శాతంలో అబ్బాయిలో రెండో ప్లేస్ లో ఉన్నారు.
సిద్దిపేట జిల్లా 97.85 శాతం పాస్ పర్సంటేజీతో మొదటి స్థానంలో ఉండగా.. 79.63 శాతంతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
రాష్ట్రంలోని 3007 స్కూళ్లలో 100 శాతం మంది స్టూడెంట్స్ పాసయ్యారు. 15 శాతం స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు.