EVM : పాపం EVMలు విహారయాత్రకెళ్లాయి..!
Latest National

EVM : పాపం EVMలు విహారయాత్రకెళ్లాయి..!

EVM s caught outside in up : ఎక్కడైనా పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. వాటికి మూడంచెల సెక్యూరిటీ పెడతారు. సమస్యాత్మక ప్రాంతాలైతే మరింత ఎక్కువ భద్రత ఉంటుంది. వాటిని బయటకు తీసుకురావడం కాదు కదా.. అభ్యర్థి తప్ప మరెవరూ వాటిని చూసే అవకాశం కూడా ఉండదు.

కానీ ఉత్తరప్రదేశ్ లో స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉండాల్సిన ఈవీఎంలు, వీవీప్యాట్ మెషిన్లు విహారయాత్రకెళ్లాయి. ఓ ట్రక్కులో మెషిన్లు వెళ్తుండగా కొదరు యువకులు గుర్తించారు. అడ్డుకుని నిరసనకు దిగారు.

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఈ ఘటన జరిగింది. అయితే.. అయోధ్యలో తాము గెలవబోతున్నామని.. అది ఓర్వలేకనే బీజేపీ ఈవీఎంల(EVM)ను ఎత్తుకెళ్లిందని ఆరోపిస్తున్నారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఎగ్జిట్ పోల్స్ కూడా ఉత్త బోగస్ అన్నారు.

బీజేపీ గెలవబోతోందని ఓ ఒపినియన్ క్రియేట్ చేసేందుకే డబ్బులు పెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేయించారన్నారు. అందులో  భాగంగానే ఇప్పుడు ఈవీఎంలు మార్చేస్తున్నారని ఫైరయ్యారు.

Read Also :