Delta plus variant death reported in Maharashtra: కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలోనూ డెల్టాప్లస్ తన ఉధృతిని చూపిస్తోంది.
డెల్టాప్లస్ ప్రమాదకరమైనదే అయినా.. అంతా భయపడాల్సిన పని లేదని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడది తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్(delata plus) వేరియంట్ తో ముగ్గురు చనిపోయారు. జులై 22న కన్నుమూసిన మూడో వ్యక్తికి 69 ఏళ్లు. ఆయన రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా.. వైరస్ అతడిని ఎటాక్ చేసింది. అతడికి సోకిన వైరస్ జీనోమ్ సీక్వెన్స్ పరిశీలించగా.. అది డెల్టా ప్లస్ అని తేలింది.
మహారాష్ట్రలో మరో నలుగురు డెల్టా ప్లస్(delta plus) వేరియంట్ సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
అందుకే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. మాస్క్ లు పెట్టుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
READ ALSO:
- Mouni Roy : మనసు దోచేస్తున్న మౌనీ రాయ్
- prabhas : ప్రభాస్ అంటే పిచ్చి.. డేటింగ్‌కు కూడా రెడీనే..
- హైపర్ ఆది పిల్ల..తోడ అందాలతో చంపుతుంది..
- షర్మిలకి ఈగో.. విజయమ్మకి మాట్లాడరాదు.. ‘కొండా సురేఖ’ హాట్ కామెంట్స్..!
- Himachal Pradesh : అందరు చూస్తుండగానే.. కళ్లముందే అంతా జరిగిపోయింది