Ravinder  Singh : కరీంనగర్ లో కేసీఆర్ ప్లాన్ అదేనా..?
Latest Telangana

Ravinder  Singh : కరీంనగర్ లో కేసీఆర్ ప్లాన్ అదేనా..?

CM  Kcr planning about Ravinder  Singh : కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఓకే వేదికపై కనిపించిన సందర్భాలు మాత్రం లేవు.

ఆ మధ్య రవీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ గ్యాప్ లోనే సీఎం పిలిచి మాట్లాడటంతో ఆయన సైలెంట్ అయ్యారు.

రీసెంట్ గా రవీందర్ సింగ్ (Ravinder  Singh)బంధువు అయిన కార్పొరేటర్ భర్త సొహైల్ సింగ్.. ఆడియో జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ కలకలం రేపింది. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రోడ్డును తవ్వేశామంటూ ఆయన మాట్లాడటం సంచలనమైంది. దీంతో మరోసారి రవీందర్ సింగ్ ప్యూచర్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also :

ఇదే క్రమంలో కరీంనగర్ కు చెందిన కొందరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు రవీందర్ సింగ్ పై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కు, మంత్రి గంగుల కమలాకర్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటూ ఆరోపించారు.

జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే హైదరాబాద్ లో కథ మరోలా ఉంది. ఈ మధ్య కేసీఆర్ ఎటు వెళ్లినా ఆయన వెంట ఉన్న టీంలో రవీందర్ సింగ్ కూడా ఉంటున్నారు. ఈ మధ్యే బిహార్ వెళ్లినప్పుడు రవీందర్ సింగ్ కూడా ఆయన వెంట ఉన్నారు.

దీంతో జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు ఏంచేయాలో అర్థం కావడం లేదట. సీఎం వెంటే ఉంటున్న వ్యక్తి గురించి సీఎంకే కంప్లైంట్ చేసేది ఎలా అని పరేషాన్ అవుతున్నారట. దీంతో ఓ సరైన టైం చూసి సీఎంకు విషయం చెప్పాలని ఆయనకు చాలా దగ్గరి వ్యక్తి అయిన వినోద్ కు కరీంనగర్ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే.. రవీందర్ సింగ్ ఇష్యూలో కేసీఆర్ ప్లానింగ్ అంతా మరోలా ఉందనే టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ లో ప్రస్తుతం గంగుల కమలాకర్ హవా నడుస్తోంది. గతంలో మేయర్ గా పనిచేసిన రవీందర్ సింగ్ కు (Ravinder  Singh) జిల్లాలో మరీముఖ్యంగా కరీంనగర్ పట్టణంలోని తన కమ్యూనిటీలో మంచి పేరుంది. ఒకవేళ రవీందర్ సింగ్ ను పక్కనపెడితే.. ఆయన కమ్యూనిటీ ఓట్లన్నీ టీఆర్ఎస్ ఖాతాలోంచి వెళ్లిపోయినట్టే.

ravinder singh with kcr

అందుకే.. కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. రవీందర్ సింగ్ ను పార్టీలోనే ఉంచేలా ఆయన ప్లాన్ చేశారట. కేసీఆర్ దేశ రాజకీయాల పేరుతో ముందుకెళ్తున్నారు. చాలా రాష్ట్రాల్లో సిక్కు కమ్యూనిటీ ఉంది. వాళ్లని ఎట్రాక్ట్ చేసేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన రవీందర్ సింగ్ ను వెంట తీసుకెళ్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నేషనల్ పాలిటిక్స్ టీంలో ఆయన్ను కూడా చేర్చుకున్నారని ప్రగతిభవన్ వర్గాల్లో టాక్ ఉంది.

దీంతో కరీంనగర్ లో గంగుల కమలాకర్(Gangula kamalakar) కు టెన్షన్ తగ్గడంతో పాటు.. జాతీయ రాజకీయాల్లో రవీందర్ సింగ్ తో ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.