Anasuya serious : ట్విట్టర్ ని షేక్ ఆడిస్తున్న అనసూయ..!
Cinema Latest

Anasuya serious : ట్విట్టర్ ని షేక్ ఆడిస్తున్న అనసూయ..!

Anasuya serious over bad comments : సోషల్ మీడియా(social media)లో ఎక్స్ ట్రాలు చేసేవాళ్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో అనసూయ(Anasuya serious)ను మించిన వారులేరని మరోసారి రుజువైంది. రెండు మూడురోజులుగా సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది రంగమ్మత్త. తాను చేసిన ఓ ట్వీట్ తో మొదలైన రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. తనపై విమర్శలు చేయడంతో దూకుడు పెంచింది.

 

మామూలుగా అయితేఎవరైనా కోపం వస్తే ఓ ట్వీట్(twitter) చేసి వదిలేస్తారు. దాని కింద వచ్చే కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోరు. కానీ కాల్షీట్ ఫుల్ బిజీగా ఉండే అనసూయ మాత్రం కామెంట్లన్నీ చదివేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క కామెంట్ కూడా వదలకుండా అన్నీ చదివేసి ఆన్సర్ కూడా ఇస్తోంది.

అన్ని కామెంట్లు చదివి ఎలాంటి కామెంట్ కు అలాంటి రెస్పాన్సే ఇస్తోంది. ఒకరు అనసూయను ఆంటీ అని కామెంట్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన అనసూయ.. ఏజ్ షేమింగ్ చేస్తారా అంటూ గరమైంది. ఇంత వయసున్న నువ్వు ఆంటీ కాకుంటే మరేంటని మరొకరు కౌంటర్ ఇచ్చారు.

ఇక.. వరుస కామెంట్ల దాడిని భరించలేకపోయిన అనసూయ(anasuya) మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటూ ఫైర్ అయ్యింది. వాడు ఎవడైనా సరే సోషల్ మీడియాలో ఇలా చెత్త ఉండొద్దంటూ జాతినుద్దేశించి ప్రసంగాలు కూడా చేసింది.

Read Also :