Actress meena husband : మీ ప్రేమే మీ ప్రాణం తీయొచ్చు.! బీకేర్ ఫుల్..!
Cinema Latest

Actress meena husband : మీ ప్రేమే మీ ప్రాణం తీయొచ్చు.! బీకేర్ ఫుల్..!

నటి మీనా భర్త విద్యాసాగర్ (Actress meena husband) అనారోగ్యంతో కన్నుమూశారు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బదిన్నాయన్నారు డాక్టర్లు. ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదన్నారు. అందుకే ఆయన మీనా భర్త మృతికి చనిపోయారని మొదట చెప్పారు.అయితే.. కారణం గురించి ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ సమస్యలే కాదు మరో ఇష్యూ వల్లే ఆయన (Actress meena husband) చనిపోయారని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నయి. ఈ వార్త చూసిన వాళ్లంతా షాకవుతున్నారు.
మీనా ఉంటున్న ఇంటికి సమీపంలో చాలా పావురాలు ఉన్నాయట. వాటి వల్ల దుమ్ము, వాటి వ్యర్థాలు ఎక్కువగా వస్తుంటాయట. పోస్ట్ కొవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయనకు(Actress meena husband) పావురాల నుంచి వచ్చి డస్ట్ తో సమస్య తీవ్రమైందని చెబుతున్నారు. దీంతో ఎన్ని మెడిసిన్స్ వాడినా అది అదుపులోకి రాలేదని డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది.
అందుకే.. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, కొవిడ్ తో తీవ్రంగా ఇబ్బంది పడినవారు ఇంటి చుట్టు పక్కల పావురాలు లేకుండ చూసుకోండి. లేకుంటే ప్రాణాలకు ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది.