ఫెడరల్ ఫ్రంట్ ఏమాయె సారూ..?

kcr federal front

లోక్ సభ ఎన్నికలు సగానికి పైగా పూర్తయ్యాయి. ఇప్పటికే నాలుగు ఫేజ్ ల పోలింగ్ అయ్యింది. ఇవాళ ఐదో విడత కూడా అవుతోంది. మరో రెండు విడతల్లో ఎన్నికలు ముగిసిపోతాయి. ఈ నెలాఖరుకు ఫలితాలు కూడా వచ్చేస్తాయి.

మరి.. అప్పట్లో గుణాత్మక మార్పు.. ఫెడరల్ ఫ్రంటు.. దేశ రాజకీయాలను మార్చేస్తా.. అని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడున్నాడు..? తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాక అసలు కంటికి కనిపించడం లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియల్ ఇష్యూతో అంత పెద్ద గందరగోళం అయినా.. ఆయన బయటకు రాలేదు. ఇక దేశ రాజకీయాలనేం శాసిస్తారు..? సారు.. కారు.. పదహారు.. అన్నరు.. కానీ.. ఆ పదహారు వచ్చే పరిస్థితి లేదనే.. చర్చ ప్రజల్లో జోరుగా జరుగుతోంది.

మరోవైపు.. మళ్లీ నేనే ప్రధానిని కాబోతున్నానని మోడీ చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం అంటున్నారు. ఇంత జరుగుతున్నా… ఫెడరల్ అంటూ భారీ భారీ డైలాగులు చెప్పిన కేసీఆర్ గారు

ఎక్కడున్నారు..? కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరా..? ఫ్రంట్ ఫాలో అప్.. మరీ ఇంత పేలవంగానా..? అనే ప్రశ్న తలెత్తింది.

దీంతో కాస్త హడావుడి మొదలైంది. నిన్న  సాయంత్రం ప్రగతిభవన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్.. వేసవికాల విడిదికోసం కేరళ వెళ్తున్నారు.. అని. అయితే.. దేశమంతా రాజకీయాలు వేడెక్కుతోంటే ఈయన మాత్రం చల్లగా టూర్లు తిరుగుతున్నాడని విమర్శలు వస్తాయనుకున్నారో ఏమోగానీ.. కాసేపటికే ప్రకటన మారిపోయింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో భేటీ అవుతారు. లోక్ సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని.. మరో ప్రకటన వచ్చింది. అయితే.. ఇందులో ఎక్కడ కూడా ఫెడరల్ ఫ్రంట్ అనే మాట రాకుండా జాగ్రత్తపడ్డారు.

అయితే.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కేసీఆర్ కేరళ సీఎంతో భేటీ అవుతున్నాడని అనుకుందాం. కేరళలో ప్రస్తుతం సీపీఎం సిట్టింగ్ ఎంపీ స్థానాలెన్ని.? కేవలం 5. ఈ మధ్యకాలంలో పరిస్థితి మరింత మారిపోయింది. శబరిమలలోకి మహిళల ప్రవేశంతో విజయన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఆ ఐదు సీట్లు కూడా గెలుస్తారా..? లేదా అన్నది ఆలోచించాల్సిన విషయమే.

మరి అలాంటి నేతతో కేసీఆర్ వెళ్లి భేటీ అవడం.. ఫెడరల్ ఫ్రంట్ లో భాగమేనంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం.. ఓ పెద్ద కామెడీ.

..

కారుకు ఓటెయ్యకుంటే కల్యాణలక్ష్మిరాదు, సీఎం రిలీఫ్ ఫండ్ రాదు..!

ఆ అమ్మాయిలంతా ఏమయ్యారు..?

మరిన్ని అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.