కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల ఉసురు తగిలిందా..?

భారీ వర్షంలో హుజూర్ నగర్ సభ కాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు సభకు జనం కూడా పెద్దగా రాలేదు. అయితే.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఉసురు తగిలే.. ఇలా జరిగిందనే మాట కార్మిక వర్గాల్లో వినబడుతోంది.

సీఎం కేసీఆర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు కేసీఆర్ కెరీర్ లో మొదటిసారి ఓ మీటింగ్ షెడ్యూల్ చేసి.. దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఓ వైపు ఆర్టీసీ సమ్మె.. మరోవైపు విపక్షాల పోరాటంతో కేసీఆర్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే టైంలో హుజూర్ నగర్ సభ రద్దు కావడం కేసీఆర్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవాలి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. కార్మికుల డిమాండ్లపై ఏమీ చెప్పడం లేదు. ఉద్యోగులందరిని పీకి పారేస్తున్నామని కఠిన నిర్ణయం తీసుకున్నారు. కనీసం సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో కార్మికులు అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమభాటపట్టాయి. ఉద్యోగసంఘాలు కూడా కార్మికులకు మద్దతు ఇస్తున్నాయి.

ఉద్యోగాలు పీకేయడం, జీతాలు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకున్నారు. అయినా ప్రభుత్వం దిగి రాలేదు. మరింత కఠినంగా ముందుకు పోయింది. కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే పరిస్థితి లేదని చెప్పింది.

మరోవైపు.. ఇదే టైంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ స్థానం నుంచి ఈ సారి గెలిచి పరువు కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు కేసీఆర్. కానీ ఆర్టీసీ సమ్మెతో ఉన్న పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరుగా అన్ని వర్గాల్లో కేసీఆర్ పై.. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. కనీసం పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.

అయితే.. ఎల్లుండితో ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. చివరి క్షణంలో హుజూర్ నగర్ వెళ్లి ఎప్పటిలాగే ప్రజలను ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు కేసీఆర్. కానీ అది సాధ్యపడలేదు. వరుణుడి రూపంలో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. భారీ వర్షంలో హుజూర్ నగర్ సభ కాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు సభకు జనం కూడా పెద్దగా రాలేదు. అయితే.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఉసురు తగిలే.. ఇలా జరిగిందనే మాట కార్మిక వర్గాల్లో వినబడుతోంది.