హుజుర్ నగర్ పై కేసీఆర్ కు ఎందుకంత భయం..?!

కేసీయార్ ఇపుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలను చూసి భయపడుతున్నారా…?  అక్కడ అధికార టిఆర్ఎస్ గెలవదు అని భావిస్తున్నారా….? లేకపోతే 70 మందికి పైగా ఇంచార్జి లను నియమించడం ఏంటి…? 

kcr fearing about huzurnagar bypoll

హుజుర్ నగర్ బై పోల్ పై కేసీఆర్ కు ఎందుకంత భయం

టిఆర్ఎస్ అధినేత కేసీయార్ కి ఒకరిని భయపెట్టడమే తప్ప భయపడడం తెలియదు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు కానీ తరువాత టిఆర్ఎస్ ని ప్రారంభించినపుడు కానీ, పద్నాలుగేళ్ల పాటు రాష్ట్రం కోసం ఉద్యమించినపుడు కానీ అందరిని భయపెట్టాడు.. కేసీయార్ నోటి వెంట మాట వస్తే చాలు అది బాంబులతో సమానం. దాంతో కేసీయార్ ఏం కొంప ముంచుతారోనని అంతా హడలి చచ్చేవారు.
ఇక ఎన్నికలను ఎదుర్కోవడం కేసీయార్ కి చాలా సరదా. ఎన్నో ఉప ఎన్నికలను ఆయన ఒంటిచేత్తో ఎదుర్కోన్నారు పొత్తులకు దూరంగా ఆయన రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అలాంటి కేసీయార్ ఇపుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలను చూసి భయపడుతున్నారా…?  అక్కడ అధికార టిఆర్ఎస్ గెలవదు అని భావిస్తున్నారా….? లేకపోతే 70 మందికి పైగా ఇంచార్జి లను నియమించడం ఏంటి…?  మంత్రులు, ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులను రంగంలోకి దించి కేసీయార్ ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు.
దానికి కారణం ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికలే. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలుచుకుని కేసీయార్ కి షాక్ ఇచ్చాయి. ఇక విపక్షాల బలం పెరుగుతోందని కూడా కేసీయార్ అనుమానిస్తున్నారు.
దాంతో ఎన్నడూ లేని విధంగా సీపీఐ నాయకుల ఇంటికి పార్టీ పెద్దలను పంపి రాయబారాలు నడుపుతున్నారు. హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ కి మద్దతు ఇయ్యమని టిఆర్ఎస్ బృందం  సీపీఐ నేత చాడ వెంకటరెడ్డినిన కలిసి కోరింది. ఇది చాలు టిఆర్ఎస్ వణుకుతోందని చెప్పడానికి….!

Bala ravi teja