“కమ్మరాజ్యంలో కడపరెడ్లు” టైటిల్ మారింది

సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. “కమ్మ రాజ్యంలో కడపరెడ్లు” సినిమాతో కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు ఆర్జీవీ

kamma rajyamlo kadapa redlu

సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. “కమ్మ రాజ్యంలో కడపరెడ్లు” సినిమాతో కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు ఆర్జీవీ. రోజుకో ఫొటో ట్విట్టర్ లో పెడుతూ.. అన్నీ పార్టీల నేతల్లో హీటు పుట్టించారు.

ట్రైలర్ లు అందులోని డైలాగులైతే మరీ సెన్సేషన్ అయ్యాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ను పోలిన వ్యక్తులకు సంబంధించిన సీన్లు, డైలాగులు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. అయితే.. సినిమా టైటిల్ పై మొదటి నుంచి వివాదం నడుస్తోంది. “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” సినిమా అంటూ టైటిట్ పెట్టడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

సినిమాతో  తనను కించపరిచారంటూ ఏకంగా హైకోర్టుకెక్కారు కేఏపాల్. ఇదే టైంలో ఓ కీలక ప్రకటన చేశారు రాంగోపాల్ వర్మ. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ మారుస్తున్నట్టు ప్రకటించారు. సెన్సార్ బోర్డు దగ్గర ఇబ్బందులు రావడంతో సినిమా పేరు మార్చినట్టు చెప్పారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాను.. “అమ్మరాజ్యంలో కడపబిడ్డలు” మార్చినట్టు చెప్పారు వర్మ.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ.. కావాల్సినంత పబ్లిసిటీ కొట్టేసిన వర్మ.. ఇప్పుడు ప్రీప్లాన్డ్ గానే టైటిల్ మార్చారనే మాట వినబడుతోంది.