‘కమ్మరాజ్యంలో..’ ఎవ్వరినీ వదలని వర్మ

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. బయోపిక్ లు, రియల్ ఇన్సిడెంట్లతో సినిమాలు తీసి వివాదాలతో సంచలనం రేపుతుండటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇదే పద్ధతిలో బాక్సాఫీస్ దగ్గర విజయాలను కూడా ఆయన అందుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయినా… టేకింగ్ పరంగా చాలా తక్కువ విలువలతో రూపొందినట్టు విమర్శలు మూటగట్టుకుంది. కానీ… కమ్మరాజ్యంలో కడప రెడ్లు మాత్రం చాలా బెటర్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ట్రైలర్ ఎంత ఆసక్తికరంగా ఉందంటే.. రిలీజ్ చేసిన కొద్దిసేపటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నంబర్ 1 అయిపోయింది. 

నటుల ఎంపికలో వర్మకు 100/100 మార్కులు

చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయాక ఏపీలో రాజధాని విజయవాడ కేంద్రంగా జరిగిన పరిణామాలతో ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ మూవీ తీసినట్టు తెలిసిపోతుంది. ఐతే… చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, దేవినేని ఉమ, పవన్ కల్యాణ్, కేఏ పాల్, బ్రాహ్మణి.. ఇలా.. పలు పాత్రలకు వర్మ ఎంపిక చేసిన నటులు ఆసక్తి కలిగిస్తున్నారు. వాళ్ల పెర్ఫామెన్స్ కూడా సూపర్ అనే చెప్పాలి. రంగం సినిమాతో పేరు తెచ్చుకున్న అజ్మల్.. మెయిన్ లీడ్ జగన్ పాత్రలో నటించాడు. ఆలీ, బ్రహ్మానందం, ధన్ రాజ్ లను కూడా చూపించాడు. ఐతే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలను వాళ్లను అచ్చుగుద్దినట్టు పోలిన నటులు పోషించారు. నటీనటుల ఎంపికలో మాత్రం వర్మకు సెంట్ పర్సెంట్ మార్కులు వేయొచ్చు.

అమిత్ షా, మోడీలను వదల్లేదు

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గమనించి ఎత్తులు వేసిన ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా పాత్రలను కూడా కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ లో చూపించారు.