జియో మాన్ సూన్ హంగామా.. మిస్ కాకండి..!

జియో మాన్ సూన్ హంగామా మొదలైంది. శుక్రవారం నుంచి ఇది ప్రారంభమవుతుందని జియో ప్రకటించింది. కామన్ పీపుల్ కు డిజిటల్ సేవలను మరింత దగ్గర చేసేందుకే ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు ప్రకటించింది జియో మేనేజ్ మెంట్.
శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ మాన్ సూర్ ఆఫర్ మొదలుకానుంది. వినియోగదారులు తమ పాత ఫీచర్ ఫోన్ ఇచ్చి.. కొత్త జియో ఫోన్ తీసుకొవచ్చు. అయితే అదనంగా 501 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏ బ్రాండ్ ఫోన్ అయినా జియో తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే జియో ఫోన్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ఫోన్ 2కు ఇది వర్తించదు.
కొత్త జియో ఫోన్ లో అతి తక్కువ ధరకే డేటా ఇవ్వనున్నారు. అలాగే ఈ ఫోన్ లో ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి అప్లికేషన్లు కూడా ఉంటాయట. ఆగస్టు 15 నుంచి ఈ యాప్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఫోన్ కొన్న వారికి రెండు అద్భుతమైన రీచార్జ్ ఆఫర్లు కూడా ఇస్తోంది జియో. రూ. 49, రూ.153. రూ.43తో రీచార్జ్ చేసుకుంటే 1జీబీ 4జీ డేటాతో పాటు.. 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా ఇవ్వనుంది. ఇక.. రూ.153తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ 4 జీ డేటా ఇవ్వనున్నారు. అలాగే 28 రోజుల వరకు అన్ లిమిటెడ్ కాలింగ్, అన్ లిమిటెడ్ SMS లు కూడా చేసుకోవచ్చు.