దేశభక్త బీజేపీకి ఏమైంది..? ఏంటీ వరుసదెబ్బలు..?

మొదటి నుంచి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ.. జాతీయత, హిందూత్వం. ఇన్నికల్లో కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ అది బెడిసికొట్టింది. 2014 ఎన్నికలకు.. ఇప్పటికీ జనం ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా..?

JHARKHAND lesson to modi amitshah

ప్రపంచంలోనే అత్యధిక మంది కార్యకర్తలున్న పార్టీ.. సమర్థవంతమైన నాయకత్వం అంటూ జాతీయ మీడియా ఆకాశానికెత్తేస్తున్న ప్రధాని… ప్రజారంజక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెబుతున్న నేతలు.. దేశభక్తి, హిందూత్వం.. ఇలాంటి కీలకఅంశాలతో దేశాన్ని ఏలుతోంది బీజేపీ.

అలాంటి బీజేపీకి ఏం జరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. మరోసారి తమదే అధికారమని చెబుతోంది. కానీ పరిస్థితులు చూస్తే దానికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా రాష్ట్రాలు చేజారిపోతున్నాయి. కాషాయం పలుచబడిపోతోంది. ఇటీవల గెలిచిన కొన్ని రాష్ట్రాల్లో వచ్చినవి కూడా అత్తెసరు సీట్లు, ఓట్లే.

ఝార్ఖండ్ కీ ప్యారే మిత్రో.. ఇంత నిర్దయ ఎందుకు మీకు?

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసిందో అందరికి తెలిసిందే. అక్కడ ఎంత హైడ్రామా నడిచిందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. 17 మంది ఎమ్మెల్యేలను లాగేసి.. బీజేపీ అధికార పీఠాన్ని ఎక్కింది.

అయితే.. ఎందుకు ఇలా అవుతోందనేదే.. ఇప్పుడు అసలు ప్రశ్న.

కొద్ది రోజుల క్రితమే.. అయోధ్యలో రామమందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. తామే దగ్గరుండి తీర్పు చెప్పించినట్టుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు బీజేపీ నేతలు. రామమందిర నిర్మాణం జరగకుండా ఇన్ని రోజులు కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ప్రచారం చేసింది. ఎన్నికల్లో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించింది.

తర్వాత సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది పౌరసత్వ చట్టసవరణ చట్టం. అపోజిషన్ పార్టీలన్నీ దీనిని వ్యతిరేకించాయి. దీంతో.. కాంగ్రెస్… ఇతర అపోజిషన్ పార్టీలన్నీ పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నాయంటూ మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలంగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నొక్కి వక్కాణించారు. జాతీయత, హిందూత్వం.. ఇవే ప్రధానాంశాలుగా ఎన్నికల ప్రచారం చేశారు.

కానీ.. జరిగిందేమిటి..?

జార్ఖండ్ బీజేపీ బొక్కబోర్లా పడింది. కొత్తగా సీట్లు సాధించడం పక్కన పెడితే.. 12 సిట్టింగ్ స్థానాలు గల్లంతయ్యాయి. ఏకంగా ఆరుగురు మంత్రులు ఓడిపోయారు. ఏకంగా సీఎం రఘువర్ దాస్ కూడా ఎదురుదెబ్బ తినక తప్పలేదు.

మొదటి నుంచి బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ.. జాతీయత, హిందూత్వం. ఇన్నికల్లో కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ అది బెడిసికొట్టింది. 2014 ఎన్నికలకు.. ఇప్పటికీ జనం ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందా..? బీజేపీ దేశంలోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా మతరాజకీయాలు చేస్తోందని ప్రజలు భావిస్తున్నారా..? లేక.. అధికారం కోసం బీజేపీ చేస్తున్న అడ్డగోలు పనులపై విసుగెత్తిపోయారా..?

రాజకీయ పార్టీ అంటే రాజకీయం చేయాల్సిందే.. కానీ ఒకప్పటి బీజేపీ అంటే.. విలువలు.. కట్టుబాట్లు ఉండేవి. నీచ రాజకీయాలకు అది దూరంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. అంతా మోనోపోలి. మోడీషా స్వామ్యం నడుస్తోంది. వాళ్లు ఏది చెబితే.. ఏది చేస్తే.. అదే వేదం. సో ఇవన్నీ చూసిన ప్రజలే కాదు.. పార్టీలోనే కేడర్ కూడా విసుగెత్తి పోయారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.