కవితక్క కోసం బెంగ పెట్టుకున్న TRS ఎమ్మెల్యే

why kavikavitha kalvakuntla

కేసీఆర్ కూతురు కవిత. ఆమె గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. అప్పట్లో ఎంపీగా కూడా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఎంపీగా  ఉన్నప్పుడు ఎక్కడ చూసినా.. ఏ ప్రోగ్రాంలో చూసినా ఆమె కచ్చితంగా ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ఆమె కోసమే రూపొందించిందనే విమర్శలు వచ్చాయి.

అయితే.. ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయారో అప్పటి నుంచి ఆమె బయటకు రావడం మానేశారు. అడపా దడపా తప్పా.. ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కవిత అంటే టీఆర్ఎస్ లో ముఖ్యనేత. అలాంటి వ్యక్తి మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో లేకపోతే ఎలా చెప్పండి.? అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఆమె అమెరికా వెళ్లిపోయారు. అయితే.. ఆమె అలిగి వెళ్లిపోయారని కొందరు. అదేం లేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.

Sari leru neekevvaru : ఇదీ అసలైన రివ్యూ

ఎవరు ఎన్ని చెప్పినా.. జగిత్యాల జిల్లాలో మాత్రం కవిత లేని మాత్రం స్పష్టంగా కనిపిస్తోందట. కవిత లేకపోయే సరికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చాలా కష్టాలు పడుతున్నారట. గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు మొత్తం కవితే దగ్గరుండి చూసుకున్నారు. సంజయ్ కి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించింది కూడా కవితేనని చెబుతుంటారు. కాబట్టి మొన్నటి వరకు ఆయనకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు.

కానీ.. తీరా క్లిష్టమైన మున్సిపల్ ఎన్నికలు వచ్చే సరికి కవితక్క… ఛలో అమెరికా అన్నారు. అసలే సంజయ్ కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు.  పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ గురించి అవగాహన అస్సలే లేదు.

ఎన్నికలు.. అందులోనూ మున్సిపల్ ఎన్నికలంటే మామూలు విషయం కాదు కదా..! అసంతృప్తులు, బుజ్జగింపులు, కేడర్ ను ఒక్కచోటికి తీసుకురావడం. అందర్ని తమవైపు తిప్పుకోవడం.. ఇలా ఇంకా చాలా.. చాలా ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కవితక్క ఫారెన్ ఫ్లైటెక్కేయడంతో. . సంజయ్ తలపట్టుకున్నారట. ఎన్నికల్లో ఓడితే బాగోదంటూ ఆల్రెడీ సీఎం వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సిచుయేషన్ లో ఏం చేయాలో తెలియక పరేషాన్ అవుతున్నారట సంజయ్.

చూడాలి మరి సంజయ్ తన సొంత బలంతో మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గుకొస్తారా..? లేకపోతే కవితక్క లేని లోటు కనిపిస్తుందో..!!