జనం మాట్లాడేది తెలుగుకాదా?

నీ భాషలో ఆధిపత్యముందా- ప్రజాస్వామ్యముందా? మూఢత్వముందా- అభ్యుదయముందా? సనాతనధర్మం ప్రకారం కిందికులాలు ఇకపై అసలు చదువుకోకూడదనే సిద్దాంతంపై నమ్మకముందా?

english medium issue in andhrapradesh

english medium issue in andhrapradesh

ఈ ఒక్క జంట-ప్రశ్నతో తెలంగాణా ఉద్యమంలో ఎదుటిపక్షం “తెలుగుతల్లి” పేరుతో చేసిన అన్ని వాదనల్ని కేసీయార్ బదాబదలు చేశాడు.

సంప్రదాయం, సంస్కృతి, మతం పేరుతో ఆంగ్లభాషని అడ్డుకునే తంతులో ఇదే ప్రశ్న అవసరం. ఎవని తెలుగుని ఇన్నాళ్ళూ జనమ్మీద రుద్దారు? పాఠ్యపుస్తకాల్లో వున్న తెలుగు ఎంత? జనం మాట్లాడేది తెలుగుకాదా? పాఠ్యపుస్తకాలకాల్లోని తెలుగుకీ, జనం మాట్లాడే తెలుగుకీ ఎందుకు తేడావుంది? 12ఏళ్లు ఒక సబ్జెక్టుగా, అన్నిసబ్జెక్టుల్ని అదేభాషగా చదువుకున్న విద్యార్థికి, తెలుగుభాషలో ఒక్కవాక్యం తప్పులు లేకుండా ఎందుకు రాయనివ్వడంలెదు?

 పలికే తొలిపలుకు తెలుగైనప్పుడు, ఆ సబ్జెక్టులో మార్కులు రావని, దానిస్థానంలో సంస్కృతాన్ని ఎందుకు ఎంచుకోవలసివస్తోంది? ఉగ్గుపాలతో నేర్చిన తెలుగు, బ్యాంకు ఏటీయంలోకి దూరగానే ఎందుకు పనికిరాకుండా పోతోంది? మొబైల్ ఫోన్లలో ఎందుకు వాడకంలేదు?

జార్జిరెడ్డి సినిమా ఎలా ఉందంటే..

ఎందుకంటే మనం మాట్లాడుకునే తెలుగుకీ పుస్తకాల్లోని తెలుగుకీ సంబంధంలేదు. అసలు మనం పుస్తకాల్లో చదువుకునే తెలుగు పుస్తకాల్లో తప్ప, పరీక్షలకు తప్ప రోజువారి వాడుకబాషకి ఎంతదూరంగా వుందో రంగనాయకమ్మగారు ఏకంగా పుస్తకమే రాసేశారు. అసలు ఈ పుస్తకభాషగా కూడా తెలుగుభాష సంప్రదాయం 120ఏళ్లు దాటదు.

1897లో రాసిన పతాపరుద్రీయం నాటకంలో మొదటిసారి జనం వాడే తెలుగుభాష రాసినందుకు ఎంతదుమారం చెలరేగిందో పిల్లసైనికులకు తెలియకపోవచ్చు. ఇప్పుడున్న పాఠ్య భాషకోసం గిడుగురామ్మూర్తీ, గురజాడ అప్పారావులు బ్రిటిష్ వారికి ఎన్ని తిరస్కారాలు, మహజర్లు సమర్పించారో అంతకన్నా తెలియదు, కాబట్టే దాని సంప్రదాయం గురించి మాట్లాడడం జరుగుతోంది. అందాకా వస్తే, కమ్యూనిస్టులు ఉత్సవాలు జరిపే గురజాడలో సామాన్యుడి అడుగుజాడ ఎక్కడ? ఏం, (మెటిల్డా), దిద్దుబాటు, కన్యక, కన్యాశుల్కం..లలో కిందికులాల భాష ఉందా? బ్రతుకుందా? బ్రతికిఉన్న ఒక్క పాత్రైనా ఉందా?

మహేష్ బాబు.. “సరిలేరు నీకెవ్వరు” టీజర్

పాఠ్యపుస్తకాల్లో అటుంచి, కవిత్వం, నవల, నాటకాల్లో అసలు తెలుగుభాష 85% కిందికులాలగురించిన జీవితం ఎప్పుడు, ఎక్కడ చిత్రించింది? స్త్రీలు, దళితులు, పేదలు ఎప్పటినుండి రాసుకోవడం మొదలుపెట్టారు? వారిదికాని వారిజీవితాన్ని “ఎంకిపాటలు”గా రాసుకుంటే సరిపోయిందా? నన్నయ, పెద్దనల కవిత్వాల్లో వున్న తెలుగెంత? శ్రీకృష్ణ దేవరాలయకాలంలో ఒక్క రచనైనా ప్రజలు మాట్లాడుకునే తెలుగులో వచ్చిందా? ఏం జనం మాట్లాడింది తెలుగుకాదా? దేవరాయలు ఉద్దరించిన తెలుగు తెలుగుకాదా? ఇందులో ఏది తప్పు?

ఎవడి సంస్కృతి ఈ తెలుగులో వుంది? ఎవడి సంప్రదాయం కీర్తించబడింది? ఏ కావ్యంలోనైనా, పురాణంలోనైనా పని సంస్కృతి (కిందికులాలది) కీర్తించబడిందా? కనీసం చీత్కరించబడకుండా నిలబడిందా? వెనకబడినకులాల భావజాలం కంచె ఐలయ్య రాతలు ఇంగ్లిష్ లోనే ఎందుకొచ్చాయి? వూరికి దూరంగా పెట్టిన బాలయ్య జీవితాన్ని “సన్నాఫ్ బాలయ్యగా” ఎందుకు ఇంగ్లిష్ లో రాసుకోవలసి వచ్చింది? సంస్కృతి అనే పదానికి, సనాతనానికి, ధర్మానికి నీ నిర్వచనం ఏమిటి?

నీ భాషలో ఆధిపత్యముందా- ప్రజాస్వామ్యముందా? మూఢత్వముందా- అభ్యుదయముందా? సనాతనధర్మం ప్రకారం కిందికులాలు ఇకపై అసలు చదువుకోకూడదనే సిద్దాంతంపై నమ్మకముందా? ఇంకెంతకాలం మనుధర్మపు చట్రంలో బహుజనుల్ని, దళితుల్ని, స్త్రీలని నానబెట్టాలనుకుంటున్నట్లు? అవమానాల్లో, అసమానతల్లో, అణచివేతలకి గురిచేద్దామనుకుంటున్నట్లు? మీకు సంకెళ్లమీద ప్రేముంటే వాటిని మీ కన్నపిల్లలకు తగిలించుకోండి. ఎందుకంటే రేపు వాళ్లే అందుబాటులో ఉన్న మీ మొహానవాటిని విసిరికొడతారు!

… Siddharthi Subhas Chandrabose