అత్యాశే రవిప్రకాష్ ను నిండా ముంచిందా…?

కాలం విలువైనది. ఈ విలువైన విషయాల్లో అది అందించే భావజాలాలం అందుకునేవాళ్ళే మిగతావారికన్నా ముందువరుసలో నిలుస్తారని చరిత్ర చెబుతుంది. అప్పట్లో రవిప్రకాశ్ ఎవరికీ తెలియదు ఒక మామూలు పాత్రికేయుడు. సుప్రభాతం అనే మేగజైన్ కి పనిచేస్తుండేవాడు. పత్రికా సమావేశం అయిపోయాక అఫ్ ది రికార్డుగా పాత్రికేయుల సమావేశంలో “సోషల్ సైన్సెస్ ఇక అనవసరం..” అంటూ టెక్నాలజీ మత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కొన్ని వాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. ఈ విషయమ్మీద గగ్గోలు రేగింది. యధావిధిగా ముఖ్యమంత్రి కార్యాలయం దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాటిని అనలేదంది, కానీ పత్రికలు కట్టుబడ్డాయి.

కారణం ఒక వ్యక్తి, అప్పుడప్పుడే వస్తోన్న సాంకేతిక పరిఙ్ఞానంతో తోటి విలేఖరులంతా కెమరాలు, రికార్డింగులన్నీ ఆఫ్ చేసినా అప్పుడే మార్కెట్లోకి వచ్చిన ఎవరికీ కనిపించని పెన్ కెమరాతో దాన్ని అలాగే రికార్డ్ చేయడం. అతడే రవిప్రకాశ్ గా, ముఖ్యమంత్రి కళ్లలోనేగాదు, యావత్ విలేఖరులు ఎవరీకుర్రాడు అని కళ్లు విప్పార్చి చూశారు. అక్కడనుండి ఎదుగుతూ, విధ్యుత్ సమ్మెలో వాటర్ కానన్లూ, గుర్రాలతో ఉద్యమకారుల్ని తొక్కించే సన్నివేశాల వీడియోలతో ముగ్దులైన పెట్టుబడిదారులు టీవీ9 ఏర్పాటుచేసి దాన్ని అతని చేతిలో పెట్టడం చకచకా జరిగిపోయాయి. అతనూ అంతే వేగంగా విస్తరించాడు. అతడు విస్తరించాడనడం కన్నా ఇంకా మొరటు రాజకీయాలూ, వ్యాపారాలూ, సినిమాలూ వాటివెనక బాగోతాలు అతడికి అవకాశమిచ్చాయనడం సమంజసం. అంతే, విదేశాల్లో ప్రాజెక్టులు, వ్యాపారాలు, లోకల్ గా పెద్దల పరిచయాల్తో దూసుకుపోయాడు. అతడు దాదాపు వ్యక్తినుండి శక్తిగా మరుతోన్న కాలంలో దెబ్బపడింది. అంతే.

పాత్రికేయ విలువల్ని కాపాడతా..

ఒకరకంగా ప్రస్తుత పరిణామం బలిసిన, అధికారంలోని వర్గాల మధ్య గొడవలు పెద్దగా పట్టించుకోదగినవికాదుగానీ వాటి ప్రభావం ఏ జనం మీద, ఎంత వరకు అనేదాన్ని చూసి ఒక అవగాహనమాత్రం కలిగివుండాలి. అంతర్గత గొడవలు వదిలేసి చూస్తే, రవిప్రకాశ్ మీద సమాజం ఆక్షేపణలు 1.అనేకజీవితాల్ని నాశనం చేశాడు. 2. వ్యక్తిగత జీవితాల్ని బయటికి తెచ్చాడు. 3. కులం, రాజకీయం కలిసిన ఒక పక్షానికి అండగా వున్నాడు లేదా మరోపక్షానికి అడ్డుగా నిలబడ్డం 4. మా సంప్రదాయాల్ని మంట గలిపాడు. వాస్తవంగా చూస్తే అన్నిటికన్నా ముఖ్యమైంది, బయటికి కనిపించనిది ఈ నాలుగో విషయాన్ని పట్టించుకునే వర్గమే.

టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా

విషయాల్ని విశదీకరిచి చూస్తే 1.అతడికి సామాన్యుల వ్యక్తిగత జీవితాలు అవసరంలేదు ఎదగడానికి, సినిమాలు, వ్యాపారాలు, రాజకీయనాయకుల చీకటి జీవితాలు బయటికి రావడంవల్ల ఈ సమాజానికి నష్టంలేదు, లాభం కుడా. 2.వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు. నిన్న ఒక మిత్రుడు ఒక కోణంలో బాగానే రాశారు- ఒక ఆటోవాలా ఒక స్కూలుపిల్లలపట్ల లైంగిక దుశ్చర్యని పదేపదేచూపడం ద్వారా అనేకమంది ఆటోవాలలలు అలా చేయడానికి ప్రోత్సాహమిచ్చాడన్నారు. కానీ మరోకోణంలో చూస్తే ఇప్పటిదాకా ఈ వ్యవస్థలో ఏది వ్యక్తిగతం, ఏది సామాజికం అనేదాన్ని ప్రశ్నించేలా చేశాడు. “నా భార్యని నేను కొట్టుకుంటా, చంపుకుంటా; నా వ్యాపారం నా ఇష్టం; నా మతం నాఇష్టం” అని జవాబుదారితనం లేని వ్య్వవస్థలో అటువంటి దుశ్చర్యలు, దురాగతాలు, దోపిడీలను వ్యక్తిలోంచి, ఇంట్లోంచి, సంస్థలోంచి బయటికిలాగి వీధిలో పెట్టాడు. ఇందాకటి ఉదాహరణను మరోరకంగా చూస్తే, ఇన్నాళ్లూ పిల్లలపట్ల ఆటోవాలాల ప్రవర్తనని పట్టించుకోని దాదాపు అందరు తల్లిదండ్రులూ ఆ విషయాలపట్ల శ్రద్ద చూపేలా చేసి మారుతోన్న కాలంలో పిల్లపై అకృత్యాలను నివారించగలిగారని, తద్వారా మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో ముందంజ వేసిందనంటే తప్పుకాబోదు.

3.రాజకీయాల విషయానికొస్తే పెద్దగా చెప్పాల్సిన పన్లేదు, అన్ని మీడియా సంస్థలు రాజకీయాలచేతనే నడపబడుతున్నప్పుడు, దీన్ని గురించి పట్టించుకోవాల్సిన పన్లేదు. 4. నాలుగోది అన్నిటికన్నా ముఖ్యమైంది టీవీ9 చర్చైంచిన సామాజిక, మత విషయాలు, సమాజం మీద విసిరిన వాగ్భాణాలు మంచిచెడుల మదింపు తర్వాత తేలేదేమంటే స్తబ్దుగా, మందకొడిగా, గుత్తాధిపత్యంగా నిలబడిన వార్తారంగాన్ని రవిప్రకాశ్ వాటిని దాటించి పరుగులు పెట్టించాడు. మాట్లాడుకోలేని చాలా విషయాలపట్ల మౌనాన్ని బద్దలు చేశాడు. కేవలం వార్తల్ని ప్రసారం చేశేచోట పల్లెలకు, తక్కువస్థాయి ప్రజలకోసం టబ్బుల్లో పడుకోబెట్టి వార్తలు ప్రశారంచేయడం సగటు మేధావివర్గానికి వెగటు అనిపించవచ్చేమోగానీ వాటిని ప్రజలు ఆదరిచారని, అవి ప్రజలకు వార్తల్ని హత్తుకునేలా చెప్పాయని గ్రహించాలి. సమాజంలో కుల, మత మూఢత్వం సడలింపులో తనదైన పాత్ర పోషించింది. 80శాతం కింది కులాలకి, 60శాతం పల్లె నేపధ్యాల జీవితాల్లో పలు విషయాలపట్ల అవగాహన తేవడంలో టివీ9 పాత్రకాదనలేనిది, ఈ పాత్రవెనుక రవిప్రకాశ్ పాత్ర నిరుపమానమైనది.

ముగింపుగా చెప్పాలంటే నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరిన రవిప్రకాశ్ నెత్తురుకక్కుకుంటూ నేలకుచెరడంలో అతని అత్యాశ వుంది, దానితో ముడిపడిన డబ్బు, రాజకీయాలు (మైహోం, అలందా సంస్థ నేపధ్యాలు, ప్రస్తుత అవసరాలు చెప్పాల్సిన పన్లేదనుకుంటాను) వున్నాయి. ఇంతకన్నా వ్యక్తుల విషయాలు మనకు అనవసరం అనేది నా భావన.

siddharthi subhas chandrabose