కేబినెట్ లో హరీశ్ రావు ఉత్సవ విగ్రహమేనా..?

HARISH RAO

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 నెలలకు పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఆర్ఎస్ ఫస్ట్ గవర్నమెంట్ లో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావుకు మొదట కేబినెట్ లో స్థానం కల్పించలేదు. ఇన్ని రోజులకు ఇప్పుడు హరీశ్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు.

హరీశ్ ను మొదట కేబినెట్ లోకి తీసుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే హరీశ్ ను పక్కపెట్టారనే వార్తలు వచ్చాయి. ఒక్క హరీశ్ రావునే కాదు. ఆయన టీం మొత్తాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టేశారనే ప్రచారం జరిగింది.

ప్రభుత్వ కార్యక్రమాల్లో హరీశ్ రావును ప్రాధాన్యతను తగ్గించడం.. పూర్తిగా ఆయనను నియోజకవర్గానికే పరిమితం చేయడం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన హరీశ్ రావును.. కనీసం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పిలవకపోవడం పెద్ద ఇష్యూ అయ్యింది.

దీంతో.. అక అంతా అయిపోయింది. హరీశ్ రావు బీజేపీలో చేరిపోతున్నారనే ప్రచారం మరింత జోరుగా జరిగింది. అయితే… అన్నింటిని కొట్టి పారేస్తూ.. హరీశ్ రావుకు ఆర్థికశాఖమంత్రిగా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఆర్థికమంత్రి.. అంటే… సీఎం తర్వాత సెకండ్ పోర్ట్ ఫోలియో అదే. అంత ప్రాధాన్యత ఉన్న పోస్టు అని అంతా అనుకుంటారు.

కానీ.. ఇది గూగుల్ సెల్ఫ్ డ్రైవ్ కారు లాంటిది. డ్రైవర్ సీట్లో కూర్చున్నా.. డ్రైవ్ చేసేది మాత్రం మనం కాదు. అంతా సర్వర్ కంట్రోల్ లో ఉంటుంది. అంటే ఆర్థికశాఖ మొత్తం ముఖ్యమంత్రి కంట్రోల్ లో ఉంటుంది. సీఎం డబ్బులు ఇవ్వమంటే సంతకం పెట్టాలి. వద్దు అంటే ఊరుకోవాలి. ఇతరశాఖల్లో ఉన్న ఫ్లెక్సిబులిటీ ఆర్థిక శాఖలో ఉండదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

మరి అలాంటప్పుడు హరీశ్ కు ఆ శాఖ ఎందుకిచ్చారనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి కారణం ఉంది. హరీశ్ రావు కేడర్ అంతా.. తమ నాయకుడికి అన్యాయం జరుగుతోందనే నిరాశలో, ఆవేశంలో ఉంది. వాళ్లను కూల్ చేయాలంటే.. కేబినెట్ లో కీలకంగా చెప్పుకునే శాఖ ఇవ్వాలి. ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా అదే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.. ఇంకా మున్ముందు ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో..!

..

మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని లైక్ చేయండి : https://www.facebook.com/batukamma/