ఐఏఎస్ లు అయ్యా ఎస్ అనాల్సిందేనా..!

సీఎం, సీఎస్ వీరిద్దరూ జోడ్డెద్దులా కలిసి నడిస్తే, రాష్ట్రం అనే బండి సాఫీగా నడుస్తుంది. అందుకే ముఖ్యమంత్రులు ఏరికోరి తమవారిని ప్రధాన కార్యదర్శులను నియమించుకుంటారు. దీంతో సీఎస్ లు సీఎంల మాటకు ఎదురు చెప్పరు. ప్రతి దానికి జూ హుజూర్ అంటూ తల ఊపుతారు.

ap and telangana cs

రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు ముఖ్యమంత్రి.  రాష్ట్ర పాలనాయంత్రాగానికి నాయకుడు ప్రధాన కార్యదర్శి.  సీఎం మంత్రుల ద్వారా పరిపాలన సాగిస్తే, సీఎస్ తన ఆధ్వర్యంలోని ఐఏఎస్ ల ద్వారా పరిపాలనకు సహకరిస్తాడు. సీఎం, సీఎస్ వీరిద్దరూ జోడ్డెద్దులా కలిసి నడిస్తే, రాష్ట్రం అనే బండి సాఫీగా నడుస్తుంది. అందుకే ముఖ్యమంత్రులు ఏరికోరి తమవారిని ప్రధాన కార్యదర్శులను నియమించుకుంటారు. దీంతో సీఎస్ లు సీఎంల మాటకు ఎదురు చెప్పరు. ప్రతి దానికి జూ హుజూర్ అంటూ తల ఊపుతారు.

అయితే మన రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీసింది. పరిధి దాటకుండా లక్ష్మణ రేఖలు నిర్దేశించింది. శాసనకర్తలు సాధారణంగా జనబాహుళ్యం నుంచి వస్తారు. వారికి రాజ్యాంగం గురించి, పరిపాలన స్వరూపం గురించి లోతైన అవగాహన ఉండదు. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ లు రాజ్యాంగం, పరిపాలన విధానాల పట్ల నిష్ణాతులై ఉంటారు. ముఖ్యమంత్రులు, మంత్రులు రాజ్యాంగం ప్రకారం నడుచుకునేలా సలహాలు ఇస్తుంటారు. చాలా సందర్భాల్లో సీఎస్ లు ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారు పాలకులు.

జర్నలిస్టులు ఊసరవెల్లులేనా…!

అయితే ఇదంతా గత చరిత్ర..

ఇప్పుడు ముఖ్యమంత్రిదే హవా. వారు చెప్పిన దానికి ఐఏఎస్ లు తలూపాల్సిందే. రాజ్యాంగం, చట్టాలు, రూల్స్ అంటే.. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పట్టిన గతే పడ్తుంది. ఒక్కసారిగా అప్రాధాన్య పోస్టుకు పంపబడతారు. నిజానికి జగన్ కు ఎంతో సహాయం చేశారు ఎల్వీ. ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆయన్ను తప్పించింది. ఎల్వీని చీఫ్‌ సెక్రటరీగా నియమించింది.

తన్నుకునుడొక్కటే తక్కువ.. రచ్చ రచ్చ..!

 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సహజంగానే ఆయననే కొనసాగించారు. చంద్రబాబు అనవసరంగా నన్ను పక్కనపెట్టేశారు. జగన్‌ ఆదరించారు’ అనే భావనతో ఎల్వీ కూడా అప్పట్లో అతి-ఉత్సాహంగా పని చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న చందబ్రాబును పూర్తిగా విస్మరించడం, ఎన్నికల అధికారి బాధ్యతలను తానే దగ్గరుండి

పర్యవేక్షించడం, కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయడం వంటి చర్యల ద్వారా సర్వం తానై వ్యవహరించారు. అప్పటి సీఎంతో బహిరంగంగానే విభేదించి వార్తల్లోకి ఎక్కారు. తాను కోరుకున్న ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఎల్వీ సంతోషంతో పనిచేశారు. అయితే 6 నెలల్లో జగన్ తో విభేదాలొచ్చాయి. వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోని కేబినెట్  సమావేశంలో ఉంచాలని రూల్స్ గుర్తు చేశారు ఎల్వీ. ఇదొక్కటే కాదని  హిందూ దేవాలయాల్లో ఉన్న అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి తప్పించినందుకు

ప్రతిఫలంగానే సీఎస్ ను బదిలీ చేశారంటూ మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు ఆరోపించారు. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులం విషయంలో జగన్ తో ఎల్వీకి విభేదాలు వచ్చినట్టు సమాచారం. మొత్తానికి సీఎంకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, అంతేనన్న భావన వ్యక్తం అవుతోంది.

ఇక తెలంగాణలోను ఇదే పరిస్థితి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తామకు తలనొప్పులు ఎదురువుతున్నాయిని ఐఏఎస్ లు మదన పడ్తున్నారని సమాచారం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆర్టీసీ సమ్మెపై పరస్పర విరుద్ధంగా అఫిడవిట్లు సమర్పించడంతో హైకోర్టు సీరియస్ అయింది. ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మను హైకోర్టు ఈ మధ్యే తీవ్రంగా మందలించింది. ఐఏఎస్ అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తారని అనుకున్నాం కానీ, తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. ఇవాళ మరోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది హైకోర్టు. డెంగీ జ్వరాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవంటూ హైకోర్టు సీఎస్ జోషిపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది.

 మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ ల పరిస్థితి అయ్యా ఎఎస్ అంటూ ముఖ్యమంత్రులు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్న విమర్శలు వస్తున్నాయి.