రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిందా..? ఇది ట్రై చేయండి.!

      
        శరీరానికి అవసరమైన అత్యధిక పోషకాలను తనలో దాచుకున్నది బీట్ రూట్. కొందరికి ఇది నచ్చకపోయినా.. చాలామంది మాత్రం పచ్చివే తినేస్తుంటారు. కొందరు కూర వండుకుని కూడా తింటుంటారు. జ్యూస్ చేసుకుని తాగే వాళ్లు కూడా ఉన్నారు. ఎలా తీసుకున్నా సరే.. బీట్ రూట్ మాత్రం శరీరానికి చాలా మేలు చేస్తుందనే చెప్పాలి.
  • రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే మీరు నాజుగ్గా మారడం ఖాయం. బీట్ రూట్ జ్యూస్ కు కొవ్వును కరిగించే గుణముంది. దీంతో మీరు బరువు తగ్గుతారు.
  •  
  • బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే గుండె సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ముఖ్యంగా హై బీపీ తగ్గుతుంది.
  • బీట్ రూట్ జ్యూస్ బాడీని రీచార్జ్ చేస్తుంది. చురుకు దనాన్ని పెంచుతుంది.
  •  
  • గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిది. దీంతో వారికి కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తద్వారా అది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
  •  
  • ఎదిగే పిల్లలకు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగించాలి. దీంతో వారికి సంపూర్ణ పోషణ అందుతుంది. బీట్ రూట్‌లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతాయి. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  •  
  • రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ సేవిస్తే ఆ సమస్య పోతుంది. రక్తం పెరుగుతుంది. అంతేకాదు లివర్ శుభ్రమవుతుంది. చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. పెదవులు పగలవు. ఎముకలు దృఢంగా మారుతాయి.