home page

 మాస్క్ తో జాగ్రత్త... మాస్క్ లతోనే బ్లాక్ ఫంగస్..! 

 | 
Mask
కరోనా నుంచి కోలుకున్న వారికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో అత్యధికంగా కేసులు నమోదు కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు కేసులు నమోదయ్యాయి.  అయితే ఈ  బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 

ముఖ్యంగా ఉతకని మాస్కులతో బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒకే మాస్కుని ఉతకకుండా రోజుల తరబడి ధరిస్తే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా లేని మాస్కులను బ్లాక్ ఫంగస్ ( మ్యూకర్ మైకోసిస్) ఇన్ఫెక్షన్ కారకాలైన మ్యూకర్ మైసెట్స్ ఆవాసంగా మార్చుకునే ముప్పు ఉందని వెల్లడించారు. ప్రతిరోజు మాస్కును శుభ్రంగా ఉతికిన తర్వాతే ధరించాలని డాక్టర్లు సూచించారు. 

అటు వెంటిలేషన్ సరిగ్గా లేని ఇళ్లలో ఉండే వారికీ ఈ వ్యాధి సోకే ప్రమాదముందని తెలిపారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు మరో కొత్త విషయం వెల్లడించారు. ఒకే మాస్క్ ను 2 నుంచి 3 వారాలు క్రమంగా వాడటం కూడా బ్లాక్ ఫంగస్ అభివృద్ధికి కారణమవ్వచ్చని న్యూరో సర్జరీ ప్రొ.డా.శరత్ పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.