Hangover : హ్యాంగోవర్ ఇలా తగ్గించుకోండి..!
Health Latest

Hangover : హ్యాంగోవర్ ఇలా తగ్గించుకోండి..!

How to over come from Hangover : వీకెండ్ వచ్చిందంటే చాలామందికి ఫుల్లుగా మందేయడం అలవాటు. పండుగల సమయంలో అది మరింత ఎక్కువగా ఉంటుంది.

ఇక దసరా పండుగ వస్తే మందు ప్రియుల ఎంజాయ్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లుగా తాగేస్తారు. కానీ ఆ మరునాడు అసలు సమస్య మొదలవుతుంది.

తెల్లవారి లేచేసరికి హ్యాంగోవర్ తో తల పట్టేస్తుంది. నీరసం, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు.. అదో నరకంగా మారుతుంది. కనీసం బెడ్ లోంచి అడుగు తీసి కింద పెట్టలేం.

నీరసంగా ఉంది కదా అని అలాగే పడుకుండిపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే కొన్ని సింపిల్ చిట్కాలు పాటిస్తే.. హ్యాంగోవర్ వదిలిపోతుంది.

అవేంటో ఇప్పుడు చూద్దాం.
  • మద్యం తీసుకున్నప్పుడు శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియల వల్ల డీ హైడ్రేషన్ అవుతుంది. హ్యాంగోవర్ తగ్గాలంటే మొదట డీహైడ్రేషన్ నుంచి బయట పడాలి. దీనికోసం ఎక్కువగా నీరు తాగాలి. జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉండాలి.
  • హ్యాంగోవర్ వచ్చాక కూడా చాలామంది నాన్ వెజ్, ఆయిల్ ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు. ఇది మంచిది కాదు. త్వరగా జీర్ణమై శక్తినిచ్చే ఆహారపదార్థాలే తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఓట్స్, మెగ్నీషియం ఎక్కువగా లభించే అరటిపళ్లు తీసుకుంటే శరీరంలో శక్తి బ్యాలెన్స్ అవుతుంది. కాస్త కండరాలు ఫ్రీ అయ్యి..  ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
  • మద్యం ఎక్కువగా తీసుకుంటే ఆ మరునాడు శరీరంలోని శక్తి పూర్తిగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే విటమిన్ బీ 12 తీసుకోవాలి. ఇది లభించే గుడ్లు, అవకాడో వంటివి తీసుకోవడం బెటర్.
  • అలాగే కాస్త నిమ్మరసం తీసుకున్నా శరీరానికి త్వరగా శక్తి వస్తుంది. కాస్త ఉప్పు, చక్కెర గానీ, తేనె గానీ వేసుకుని ఓ రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే చాలు.
  • అన్నింటికంటే వేగంగా హ్యాంగోవర్ తగ్గాలంటే.. కొబ్బరినీళ్లె బెటర్. ఓ 250 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు కొద్దికొద్దిగా తాగేయండి. కాసేపట్లోనే చాలా రిలాక్స్ గా ఫీలవుతారు. ఒకేసారి లాగించేస్తే వామిటింగ్ చేసుకునే ప్రమాదం ఉంది.
  • చాలామంది హ్యాంగోవర్ అయినప్పుడు పారాసెటమాల్, ఐబప్రోఫెన్ ట్యాబ్లెట్స్ వాడతారు. అయితే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పారాసిటమాల్ ఎక్కువగా వాడితే కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే కొంత వరకు ఐబప్రొఫెన్ వాడొచ్చు.

మ్యాగ్జిమమ్ ట్యాట్లెట్లను పక్కనెట్టేసి.. పైన చెప్పుకున్నట్టుగా నేచురల్ పద్దతులను పాటిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. హ్యాంగోవర్ కూడా తగ్గిపోతుంది.

Read Also :