వచ్చేసింది హరీశ్ శంకర్ ‘శ్రీదేవి’

అవే బిందెలు… అదే పింక్, తెలుపు రంగు డ్రెస్సుల్లో అందాల నటి శ్రీదేవిని … పూజాహెగ్డేలో చూపించారు దర్శకుడు

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిలా పడ్డాదమ్మో

ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండి గిన్నేలయ్యేనమ్మో

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో.. రావయ్యో.. ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..

మీగడంతా నీదేలేరా బుల్లోడా..

1982లో దేవత సినిమా కోసం వేటూరి సుందరరామ్మూరి రాసిన… చక్రవర్తి కంపోజ్ చేసిన ఈ పాట తెలుగు చిత్రసీమలోనే ఎవర్ గ్రీన్ హిట్.  శోభన్ బాబు, శ్రీదేవిలపై తీసిన ఈ పాటను 37 ఏళ్ల తర్వాత నేటితరం సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ రీమిక్స్ చేశారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్మీకి సినిమాకోసం ఈ పాటను రీమిక్స్ చేశారు.

కొణిదెల వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై ఈ పాట చిత్రీకరించారు. వాల్మీకి ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా… ఈ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. అవే బిందెలు… అదే పింక్, తెలుపు రంగు డ్రెస్సుల్లో అందాల నటి శ్రీదేవిని … పూజాహెగ్డేలో చూపించారు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో భాగంగా ఈ పాట వస్తుందని ఇటీవల చెప్పాడు డైరెక్టర్. అప్పటి పిక్చరైజేషన్ ను యాజిటీజ్ గా దింపేసి.. అలరించాడు డైరెక్టర్. ఫుల్ పాటకోసం థియేటర్లలో ఎదురుచూసేంత ఇంట్రస్ట్ పెంచేశారు మేకర్స్. ఎల్లువొచ్చి రీమిక్స్ పాటను గీతామాధురి పాడారు.