న్యూ ఇయర్… హ్యాప్పీ…!

హ్యాపీ న్యూ ఇయర్… ఎప్పటిలా చాలా మెకానికల్గా…
విత్ డిప్రెస్సివ్ స్మైల్… విత్ హెవీలీ డిస్టర్బ్డ్ సోల్
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్… కాంప్రమైజ్ కా.

ఏనుగంత మనిషి కుందేటి బొరియలో బతుకున్నట్టు…
ఊపిరాడదు…
కాళ్లూచేతులూ కదలవూ
వెలుతురు దుమ్ము ఏ మూల నుంచీ చీల్చుకురాదు.
విరామంలేని విసుగు… సమాధిస్థితిలో కలలు
జీవితమంతా సంతృప్తి బలవంతపు జపం
అలవాటైన ఇష్టమూ ఇంట్రెస్టూలేని యుద్ధమూ
ఎటు పారిపోవాలో తెలిసినా అడుగేయనీలేని కమిట్మెంట్లు, ఆదర్శాలు చాలా అందరిలా బతకనీయవ్..
కొందరిలానైనా దులుపుకుపోలేం.
ఓ కంఫర్ట్జోన్ లోలోకి తప్పిపోయాక
బాగా ఉందన్న ప్రపంచాన్ని అణుబాంబులతో తర్వాత
కనీసం రవ్వంత కూడా దుప్పటి కదపలేని చలిజ్వరం
ఏదోలా జరిగిపోతుందిగా సర్దుకుపోదామంటే
ఉరికొయ్యకు ఊగిసలాడుతున్న ప్రాణం
రిఫ్రష్షూ రిజెవొనేటూ రీబర్తూ రెన్నెసాన్సూ….
అంటే… మళ్లీ మళ్లీ మనమే తలారి అయ్యి
కొత్తగా పాత తల తెగ్గొట్టుకుని ప్రాణం పోసుకోవడం
న్యూ రెజొల్యూషన్ల పురుడులో ఓ ఏకాంత హత్య
కాఫ్కా అంత నిరాశావాదైనా ఎందుకు ఎగ్జైటు చేస్తాడు
జవాబు నీ దగ్గరా ఉండొచ్చు..
టెంప్టేషన్లు.. లావిష్ లైఫుస్టయిళ్లు కళ్లను
డేజ్ చేయొచ్చు.. ఇప్పటికిప్పుడు సర్వైవ్ కావడం
డ్యామేజీని తడమకుండా సమయాన్ని దిగజార్చొచ్చు
సారాన్ని తత్త్వాన్ని నాలానే కుంపట్లు గుండెలో
గొట్టంతో ఊదుకుంటూ దగ్ధమైపోతుండాలంటే
నిత్యం రావణకాష్టం మధ్య కూర్చుని చలికాచుకోవాలంటే… ప్లీజ్ వద్దనిపిస్తుంది.. నిద్ర మిగల్చని కలలు… కలల నుంచి బయటపడలేని కథలు… ఊహామోహాలు…
యదార్థవాదీ… అనల్ప సంతోషీ… చితిమత్తు దేవదాసీ
డోంట్ బీ ప్రాక్టికల్… భయపడిపోతానంతే
లూసిడ్ డ్రీమ్లోనైనా తలదాచుకోనీ
డ్రీమర్… ఒరేయ్ వెర్రోడా పిటీ యూ
నూతన సంవత్సరానికి ప్చ్..మనే ఎమోజీ జిఫ్ఫీ విషెస్
డిజిటల్గానైనా డల్గా బతుకులేనందుకు గర్వపడు
జస్ట్ లైకులూ లోల్ లతో తృప్తిపడు… వెల్కమ్
ఎన్నిదారులున్నా… పూలురాలిన దోవలున్నా
పండ్లతోటల వనరులున్నా.. కళ్లుతెరచి పరుగెత్తు
కొండ చివరకు… అటు శిఖరాన్ని
ఒక్క ఉదుటన గెంతి తాకేందుకు….
మృత్యులోయ ఆశగా నోరుతెరచి చూస్తోంది…
దూకేయ్… నేనిప్పటిలా ఉన్నా లేనట్టేనని
బలమైన గాలిలేకుంటే పక్షి ఈక… నేనూ ఒకేసారి
గురుత్వాకర్షణ సూత్రం
బతుకు అయస్కాంత లక్షణం గుండెలకి ఇనుపముక్కని
నా చేతుల్తో పొడిపిస్తుంది… నేనెలాగూ జీవచ్ఛవం
రక్తం ఉబికి గడ్డకడుతుంది…
శిలాజమో శిల్పమో అయ్యి నా తర్వాత ఓ జీవితకథ చెప్పబడుతుంది
హ్యాపీ న్యూ ఇయర్… ఎప్పటిలా చాలా మెకానికల్గా…
విత్ డిప్రెస్సివ్ స్మైల్… విత్ హెవీలీ డిస్టర్బ్డ్ సోల్
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్… కాంప్రమైజ్ కా.

..

Ajay Kumar varala