George reddy:జార్జిరెడ్డి సినిమా ఎలా ఉందంటే..

గన్ జార్జిరెడ్డి ఎప్పుడైనా ఉపయోగించాడా.?
జార్జిరెడ్డి గన్ వాడితే చరిత్ర మరోలా ఉండేదీ..
సీన్: అక్కడ తుపాకీ తీసుకొని.. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంది….

george reddy-review

george reddy-batukamma.com

జార్జిరెడ్డి” చాలా చాలా బాగా నచ్చింది..
ప్రతీ ఫ్రేమును రిచ్‌గా, అందంగా తీర్చిదిద్దిన విధానం నచ్చింది..
టేకింగ్, మేకింగ్, లైటింగ్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది..
కాంట్రవర్సీలెన్ని ఉన్నా ఖలేజాతో సినిమా తీయడం ఇంకా నచ్చింది..
భారీ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిన విధానం నచ్చింది..
పెద్ద ఆర్టిస్టులు ఒదిగి నటించిడం..
చిన్న ఆర్టిస్టులు ఎంతో ఎదిగినట్టుగా నటించడం..
బాగా బాగా నచ్చింది…
……………
సినిమాలో ..
ప్రశ్న: ఇంతకూ మీరు ఈ డాక్యుమెంటరీతో ఏం సాధిద్దామనుకుంటున్నారు..
జవాబు: చరిత్రను మారుద్దామనుకుంటున్నా…

Read Also : జబర్దస్త్ కు అనసూయ, హైపర్ ఆది గుడ్ బై..!! అభి ఏమన్నాడంటే..

ఈ మాటొక్కటి సరిగ్గా సరిపోతుంది జార్జిరెడ్డి సినిమా గురించి చెప్పాలంటే..
బహుషా సినీ రూపకర్తలు కూడా ఇదే ఆశించి సినిమా తీశారని ప్రతీఫ్రేము తెలియజేస్తుంది..
కథకు ఎన్నో హంగులు, పొంగులు చేర్చే అవకాశం ఉన్నా.. ఎక్కడా హద్దు దాటలేదు..
జార్జిరెడ్డి ఔన్నత్యాన్ని దెబ్బతీయలేదు..
అలాగని ఆందోళనకారులకు అవకాశంగా మారే ఏ విషయానికీ చోటివ్వలేదు..
కథనం ఏ కొంచెం మార్చినా సినిమా ఇంకో రేంజిలో ఉండేది..
అయినా ఉద్దేశ్యపూర్వకంగానే జార్జిరెడ్డి కథను కలుషితం చేయకూడదనుకున్నట్టున్నారు.
జార్జిరెడ్డిని ఉన్నదున్నట్టుగా మన గుండెలో ముద్రించాలని మాత్రమే నిర్ణయించుకున్నట్టున్నారు..
వ్యాపార కిటుకుల కంచెలను తీసేసి జార్జిరెడ్డిని మన ముందు ఆవిష్కరించారు..
అందుకు జార్జిరెడ్డి రూపకర్తలకు కృతజ్ఞతలు..
…..
ప్రశ్న: ఈ గన్ జార్జిరెడ్డి ఎప్పుడైనా ఉపయోగించాడా.?
జవాబు: జార్జిరెడ్డి గన్ వాడితే చరిత్ర మరోలా ఉండేదీ..
సీన్: అక్కడ తుపాకీ తీసుకొని.. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంది….
ఈ సీన్ ఒక్కటి చాలు..
జార్జిరెడ్డి సినిమా రూపకర్తలు జార్జిరెడ్డిని ఎంతగా ప్రేమించారో.. జార్జిరెడ్డిని మన గుండెలకు ఎంతలా అద్దుతున్నారో చెప్పడానికి..
జార్జిరెడ్డి పౌరుషమేదో, చెప్పిన పోరాట పటిమలేవో..
బతకాలంటే చావడం కూడా నేర్చుకోవాలని చెప్పిన పాఠాలేవో..
హుస్సేన్ సాగర్ నీళ్ళలో కలిసినట్టు భావన కలిగేలా తీశారు..
ప్రశాంత చిత్తుడై చూస్తున్న బుద్ధుని విగ్రహం చుట్టూ ఆవరించిన ఉన్న నీళ్ళలో జార్జిరెడ్డి ఆవేశమేదో నిండుకొని ఉన్నదని నేటి తరానికి చెప్తున్నట్టుగా తీర్చి దిద్దారు…

george reddy


……..
సీన్:
ఇటు (జార్జిరెడ్డి హింస గురించి చెబుతుంటాడు..)
అటు అసెంబ్లీ ముందు గాంధీ మౌనంగా శాంతిని ప్రబోధిస్తున్నట్టుగా ఉంటాడు..
రెండు భిన్న వైరుధ్యాలు..
సమాజంలో ఏళ్ళ తరబడి సంఘర్షించుకుంటున్న రెండు భిన్న సిద్ధాంతాల పాఠంగా జార్జిరెడ్డిని రూపొందించారు..
….
తప్పక చూడండి జార్జిరెడ్డి..
ఇలాంటివెన్నో మీకు మరపురాని ఉత్తేజాన్ని కలిగిస్తాయి..
జార్జిరెడ్డిని తప్పకుండా చూడండి..
మొద్దుబారిన హృదయపు పొరలను చీల్చి పౌరుషపు పాలధారను జార్జిరెడ్డి పోస్తాడు..
వారసత్వాలు, వందల కోట్ల పెట్టుబడులు లేకుండా ఓ సినిమాను ఎంత భారీగా తీయొచ్చో తెలిస్తుంది..
భారీ గ్రాఫిక్సులు, బూతు డ్యాన్సులు, ద్వంద్వార్థాల మాటలు లేకుండా ఆసాంతం కట్టిపడేసే కథను ఎలా చెప్పొచ్చో తెలుస్తుంది…
సినిమా పట్ల అంకితభావం, శ్రద్ధ అడుగుడుగునా కనిపిస్తుంది..

..రత్నకుమార్