100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావ్..?

తెలుగు టెలివిజన్ రంగంలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మొదటి రెండు సీజన్లలో బిగ్ బాస్ షో విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. అయితే మూడో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్ బాస్ షోపై వివాదం ముసురుకుంటోంది.

Read Also : వరల్డ్ కప్ విన్నర్ ‘ఇంగ్లండ్’.. రిజల్ట్ ఇలా ప్రకటించారు!

మొదట ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షో మేనేజ్ మెంట్ పై తీవ్ర ఆరోపణలు చేయగా, ఇప్పుడు నటి గాయత్రి గుప్తా సైతం అదే తరహా అనుభవాలు తెలిపారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు, వెళ్లిన తనకు ఆ షో నిర్వాహకుల నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వెల్లడించారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు తనను 100 రోజుల పాటు సెక్స్ కు దూరంగా ఎలా ఉంటావని అడిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

gayathri-gupta (1)
టీవీ చర్చావేదిక ద్వారా గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులు దిగజారుడుతనాన్ని ఎండగట్టారు. అంతేకాదు గడిచిన సీజన్ లో తనకు బిగ్ బాస్ అవకాశం రాకపోవడం వల్ల తనకు మంచే జరిగినట్లు హౌస్ మేట్స్ సైతం తనతో చెప్పినట్లు గాయత్రి గుప్తా అన్నారు.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో చుట్టూ ముసిరిన వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. నటి శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ అంశంపై పడింది.

Read also : బాల్ టు బాల్ డీటెయిల్స్ : సూపర్ ఓవర్ లో ఏమైందంటే..!


తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇది సంచలన నటి శ్రీరెడ్డితోనే మొదలైందని అంతా అనుకుంటారు. కానీ, ఆమె కంటే ముందే ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది గాయత్రి గుప్తానే. తనను అవకాశాలు ఇస్తానని చాలా మంది మోసం చేశారని, అలాగే కొంతమంది ఛాన్స్ కావాలంటే ఏం చేస్తావని ప్రశ్నించారని చెప్పి బాంబు పేల్చింది.

రివ్యూ : “దొరసాని” ఇది సినిమా కాదు.. జీవితం