వాటీజ్ దిస్.. ఇంత బరితెగింపా..?

అదికాదుబ్రో… మరీ ఇంత బరితెగింపా. CAA వ్యతిరేకుల మీద అందరూ చూస్తుండగా ఒకడు కాల్పులు జరుపుతాడు. వాన్ని సంఘీలు సమర్థిస్తారు. ఇది టూ మచ్ బ్రో.

అవును మరి, ఏకంగా ఒక కేంద్ర మంత్రే “గోలీ మారో సాలోంకో” అని బహిరంగంగా పిలుపిస్తే వాడు కాల్చకుండా ఉంటాడా? వాళ్లకు కావాల్సింది కూడా అదే. ఏదో ఒకరకంగా హింసను ప్రేరేపించాలని ప్రయత్నిస్తున్నారు.

అదికాదుబ్రో… దానికితోడు ఆ అర్ణబ్ గాడు వాడి చానెల్లో “కాల్పులు జరిపిన జామియా నిరసనకారులు” అని తప్పుడు న్యూస్ వేస్తున్నాడు. కాల్చింది ఒక సంఘీ తీవ్రవాది, గాయపడ్డది ఒక జామియా నిరసనకారుడు. ఇదికదా అసలు జరిగింది?

నేను ముందే చెప్పాను, అర్ణబ్ అనేవాడు ఒక మీడియా టెర్రరిస్ట్. ఇలాంటి వాన్ని ఆరాధించే మూర్ఖులు ఉన్నంత కాలం వాడు తప్పుడు వార్తలు వేస్తూనే ఉంటాడు. సంఘీలను సమర్థిస్తూనే ఉంటాడు. వాళ్లు జనాల మీదపడి దాడులు, కాల్పులు జరుపుతూనే ఉంటారు.

అదికాదుబ్రో… వాళ్లు మాత్రమే కాదు, మనదగ్గర కూడా ఇలాంటి వాళ్లు తయారయ్యారు. అర్ణబ్ ని విమర్శించొద్దు, CAAని వ్యతిరేకించొద్దు, బీజేపీని ప్రశ్నించొద్దు అని ఒకటే బెదిరింపులు, ట్రోలింగులు. పైగా అసహ్యమైన పోస్టులు, కమెంట్లు కూడా.

ఇట్లాంటి పిట్ట బెదిరింపులు ఎన్ని చూడలేదు. మనం ట్రోలింగ్ మొదలుపెడితే ఈ పువ్వు సంఘీ బ్యాచ్ తట్టుకోలేదు. అయినా వాళ్లు చదువుకున్నారేగాని పొట్టకోస్తే అక్షరం రాదు. విషయం తెలియదు, చెప్పినా అర్థం కాదు. అట్లాంటి వాళ్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్.

Thirumal Reddy sunkari