FACT CHECK: మంత్రులు నిజంగానే మందేశారా..?


సోషల్ మీడియా అంటేనే ఓ వింత ప్రపంచం. అక్కడ ఎవ్వరు ఏం పోస్ట్ చేస్తారో.. దానికి ఎవరు ఏం కామెంట్ రాసి షేర్ చేస్తారో.. చివరకు అది ఎంత వరకు వెళుతుందో కూడా తెలియని పరిస్థితి. అదిగో తోక అని ఒకరంటే.. ఆల్రెడీ పులి వచ్చేసింది.. పది మందిని తినేసి కూడా పోయింది అంటూ మరొకరు పోస్ట్ పెడతారు. రచ్చ రచ్చ చేసి వదిలిపెడతారు.
అయితే.. పొలిటీషియన్లు, సెలబ్రిటీల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. వారికి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి, క్రాప్ చేసి… చాలా రకాలుగా వాడేస్తుంటారు. ఫొటో ఒక సందర్భానికి సంబంధించినది అయితే.. దాన్ని మరో సందర్భాన్ని జోడించి తప్పుడు ప్రచారం చేస్తుంటారు.
ప్రస్తుతం.. ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. హోమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మరో నేత.. చేతుల్లో గాజు గ్లాసులు పట్టుకుని(అందులో లిక్కర్ రంగులో ఉన్న పానీయం ఉంది) సోఫాల్లో కూర్చుని ఉన్న ఓ ఫొటో ఫేస్ బుక్ లో , వాట్సప్ లో విచ్చలవిడిగా వైరల్ అవుతోంది.
ఇంటర్మీడియట్ ఫలితాల అంశాన్ని బేస్ చేసుకుని.. ఈ ఫొటోపై కామెంట్లు పేలుతున్నాయి. “పిల్లలు చనిపోతే మాకేంటి.. మాకు మా సారు నేర్పించింది ఇదే” అంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతోంది.
చాలు శ్రీముఖి… చూడలేకపోతున్నాం
నిజానికి.. ఈ ఫొటో ఉగాది పండుగనాటిది. ఉగాది రోజు మహమూద్ అలీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనకు గ్లాసులో ఉగాది పచ్చది ఇచ్చారు జగదీశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులు. ఆ సందర్భంలోనే ఇలా చేతుల్లో ఉగాది పచ్చడి గ్లాసులు పట్టుకుని ఉండగా తీసిన ఫొటో ఇది.
జగదీశ్ రెడ్డి ఇంట్లో ఉగాది వేడుకలకు సంబంధించి.. ఓ వెబ్ సైట్ లో పబ్లిష్ అయిన వార్త..
కానీ వాళ్లేదో మందుపార్టీ చేసుకుంటున్నట్టుగా.. అది కూడా ఇంటర్ ఫలితాలు వచ్చి 17 మందికి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నాక.. వీళ్లు మాత్రం మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.
విమర్శలు చేయొచ్చుగాని.. ఇలా తప్పుడు ప్రచారాలు సరికాదు.
..