ఇదేదో మానవ మృగం పని అనుకోకండి…

లైంగిక దాడిలో ఓ ఏనుగు చనిపోయింది. మీరు చదివింది నిజమే.. లైంగిదాడిలో ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. అయితే.. మళ్లీ ఇదేదో మానవ మృగం పని అనుకోకండి. లైంగిక దాడి చేసింది కూడా ఓ ఏనుగే. ఒక మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది.

ఇది కూడా చదవండి : టిఆర్ఎస్ పార్టీ జెండా కూడా కనిపించని దుస్థితి…

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేట కోటూరు అటవీ పరిధిలో ఏనుగు మృతదేహం పడి ఉండటాన్ని కొందరు స్థానికులు గమనించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి వెళ్లి పరిశీలించిన అధికారులు.. ఏనుగు అనారోగ్యంతో మరణించి ఉండొచ్చిని భావించారు.

ఇది కూడా చదవండి : వీ6 తీన్మార్ వార్తల్లో కొత్త యాంకర్.. ఎవరో తెలుసా..?

ELEPHANT

అటవీశాఖ ఉన్నతాధికారులు కూడా దానిని పరిశీలించారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు. చివరకు సోమవారం సాయంత్రం ఏనుగుకు పోస్ట్ మార్టం నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

మగ ఏనుగు చేసిన లైంగిక దాడిని తట్టుకోలేక ఆడ ఏనుగు చనిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతైంది.

..

Read Also : వరల్డ్ కప్ విన్నర్ ‘ఇంగ్లండ్’.. రిజల్ట్ ఇలా ప్రకటించారు!

Read also : బాల్ టు బాల్ డీటెయిల్స్ : సూపర్ ఓవర్ లో ఏమైందంటే..!