వైభవంగా డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020 మహోత్సవం !!!

నవ్వుల్ని నలుగురికి పంచేవారు కూడా డాక్టర్లే అనే నినాదాన్ని పురస్కరించుకొని విక్రమ్ ఆర్ట్స్ విక్రమ్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘నేచర్ కేర్ ఇన్నోవెర్షన్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ (ncis ) శ్రీ బెల్లం విజయ కుమార్ రెడ్డి గారు సమర్పించిన డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020 మహోత్సవం ఫిబ్రవరి 29న రాడిషన్ బ్లూ హోటల్ లో కన్నుల విందుగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన శ్రీ రసమయి బాలకిషన్ గారు తమ పాటలతో ఉర్రుతలుగించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులకు తమ నవ్వులు పంచుతున్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్ రాకేష్, ఉదయశ్రీ, స్వప్న, నాగిరెడ్డి, చంద్రముఖి చంద్రశేఖర్, యాదమ్మ రాజు, జీవన్ మరియు, సూర్య తేజు, సుబ్రాన్త్ లను ఘనంగా సన్మానించి డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ తో సత్కరించారు.

ఈ కార్యక్రమం అనంతరం చక్కని విందు భోజనంతో అతిథులను గౌరవించుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా బి ప్రిపేర్డ్ ఎడ్యుకేషన్ అప్ ను విడుదల చేశారు.