మానవ మృగాలు మటాష్..

disha accuded encountered

దిశాను అత్యంత పాశవికంగా మానభంగం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు కాల్చి చంపారు. దిశాను కాల్చి చంపిన ప్రాంతంలోనే.. నిందితులను వేసేశారు పోలీసులు.

రాత్రి ఏం జరిగింది..?

కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నలుగురు నిందితులను స్పాట్ కు తీసుకెళ్లారు పోలీసులు. ముందు నుంచి చంచల మస్తత్వం కలిగిన నిందితులు.. తమ బుద్దికి పనిచెప్పారు. పోలీసులను తోసుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్టైన పోలీసులు వారిని కాల్చి చంపారు.

అసలేం జరిగింది..?

నిన్న ఉదయం చర్లపల్లి జైలులోనిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నిజానికి షాద్ నగర్ ఏసీపీ ఆఫీసుకు తీసుకెళ్లి వారిని విచారించాలి. కానీ జైలు నుంచి బయటకు తీసుకొస్తే ప్రజలు దాడి చేసే అవకాశం ఉండటంతో జైళ్లోనే నిందితులను సాయంత్రం వరకు విచారించారు.